Bimbisara: సినిమా రిజల్ట్‌పై కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-08-06T02:54:25+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) జంటగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (NTR Arts) ప‌తాకంపై హ‌రికృష్ణ.కె (Harikrishna K) నిర్మించిన చిత్రం ‘బింబిసార’

Bimbisara: సినిమా రిజల్ట్‌పై కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) జంటగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (NTR Arts) ప‌తాకంపై హ‌రికృష్ణ.కె (Harikrishna K) నిర్మించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). ఈ చిత్రంతో వశిష్ట (Vasishta) దర్శకుడిగా పరిచయమయ్యారు. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు ఈ చేసింది. 


ఈ కార్యక్రమంలో హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘మాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు థ్యాంక్యూ. ఇది మా విజయం అని చెప్పుకోను. ఇది ప్రజల విజయం. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే.. జనాలు తండోపతండాలుగా థియేటర్లకి వస్తారని నిరూపించారు. ఈ విజయానికి మా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీకు రుణపడి ఉంటాం. మరోసారి మమ్మల్ని బ్రతికించారు మీరు. ఈ సందర్భంగా ముందు ముందు మంచి సినిమాలతో మీముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. 


సినిమా విషయానికి వస్తే.. సినిమాకి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్యూ. ముందుగా కీరవాణి‌గారు రీ రికార్డింగ్‌తో ఈ సినిమాకి ప్రాణం పోశారు. థియేటర్‌లో చూస్తుంటే నాకే గూజ్‌బంప్స్ వచ్చాయి. కెమెరామెన్ చోటాగారికి, ఎడిటర్ తమ్మిరాజుగారికి థ్యాంక్యూ. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్‌గారు అద్భుతమైన సెట్స్ వేశారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ టీమ్‌ మంచి వర్క్ కనబరిచారు. డైలాగ్స్ రైటర్ వాసుదేవ్.. మా పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వచ్చేవారు. నా బర్త్‌డే సందర్భంగా ఒకసారి ఓ కవిత రాశారు. అది చూసి స్టన్ అయ్యాను. వెంటనే దర్శకుడికి అది చూపించాను. ఆయన టాలెంట్‌కి ఆయన కూడా ఫిదా అయ్యారు. ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ సినిమాకు ఎంతగానో ఎఫర్ట్ పెట్టారు. వారందరికీ థ్యాంక్యూ. 


ఇక బింబిసారుడు అనే గొప్ప క్యారెక్టర్‌ని నేను చేయగలనో లేదో.. అనే నమ్మకం నాకు లేదు కానీ.. నేను చేయగలను అని.. ఈ సినిమాని నా దగ్గరకు తీసుకువచ్చిన దర్శకుడు వశిష్టకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నిర్మాత హరిగారికి థ్యాంక్యూ. చిత్రంలో నటించిన నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇక అందరికంటే ముందు ఈ సినిమాని చూసి, ఫస్ట్ ఆడియన్‌గా ఎంతో సపోర్ట్ చేశాడు నా తమ్ముడు.. లవ్ యూ నాన్నా. ఇక ‘బింబిసార’ పార్ట్ 2 (Bimbisara 2)‌ను బాధ్యతతో తెరకెక్కించాల్సిన బాధ్యతను వశిష్టకు అప్పగిస్తున్నాను. ఆ సినిమాతో భారీగా.. ఇంకో అద్భుతమైన సినిమాతో మీ ముందుకు వస్తాం.. అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.



Updated Date - 2022-08-06T02:54:25+05:30 IST