జస్ట్ నవ్వుకోండి: కల్యాణ్ దేవ్

ABN , First Publish Date - 2022-01-31T04:19:17+05:30 IST

‘విజేత’, ‘సూపర్ మచ్చి’ వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందిన కల్యాణ్ దేవ్.. ప్రస్తుతం ‘కిన్నెరసాని’ అనే చిత్రంలో చేస్తున్నారు. మెగా ఫ్యామిలీతో ఆయన బంధంపై ఈ మధ్య అనేకానేక వార్తలు వినిపిస్తున్నా.. ఆయన కానీ, మెగా ఫ్యామిలీ సభ్యులు

జస్ట్ నవ్వుకోండి: కల్యాణ్ దేవ్

‘విజేత’, ‘సూపర్ మచ్చి’ వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందిన కల్యాణ్ దేవ్.. ప్రస్తుతం ‘కిన్నెరసాని’ అనే చిత్రంలో చేస్తున్నారు. మెగా ఫ్యామిలీతో ఆయన బంధంపై ఈ మధ్య అనేకానేక వార్తలు వినిపిస్తున్నా.. ఆయన కానీ, మెగా ఫ్యామిలీ సభ్యులు కానీ ఎవరూ స్పందించలేదు. ఆ విషయం పక్కన పెడితే.. దాదాపు నెల రోజుల తర్వాత కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కూడా మాములుగా లేదు.. అనేక అర్థాలకు తావిచ్చేలా ఉంది. 


కండలు తిరిగిన దేహంతో ఉన్న పిక్‌‌ని పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. “ఇది మీరు చేయలేరు అని ఎవరైనా మీతో అంటే.. ఒక చిన్న నవ్వు నవ్వి.. చేసేది చూడమని చెప్పండి” అని తెలిపారు. ఈ పిక్‌లో ఆయన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరికీ షాకిస్తోంది. దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. మాసివ్ ఛేంజ్ అంటూ కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు ఆయన వ్యక్తిగత జీవితంపై వివరణ ఇవ్వాలంటూ కామెంట్స్ చేశారు.



Updated Date - 2022-01-31T04:19:17+05:30 IST