క్లీన్‌ కామెడీతో కళాపురం

ABN , First Publish Date - 2022-08-17T07:02:52+05:30 IST

కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కళాపురం’. ‘సత్యం’ రాజేశ్‌, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రలు పోషించారు....

క్లీన్‌ కామెడీతో కళాపురం

కరుణ కుమార్‌ దర్శకత్వంలో  రూపొందించిన చిత్రం ‘కళాపురం’. ‘సత్యం’ రాజేశ్‌, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రలు పోషించారు. రజనీ తాళ్లూరి నిర్మాత. ఈనెల 26న విడుదల చేస్తున్నారు.  హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎక్కడా ఎలాంటి అసభ్యత, అశ్లీలం, ద్వందార్థాలూ లేకుండా క్లీన్‌ కామెడీతో రూపొందించిన చిత్రమిది. ఆరోగ్యవంతమైన వినోదాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ కథ రాసుకొన్నా’’అన్నారు. ‘‘ట్రైలర్‌ చూస్తే.. మా సినిమా ఏమిటో అర్థమవుతుంది. అనుకొన్న సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేశామంటే దానికి దర్శకుడు పడిన శ్రమే కారణం’’ అన్నారు సత్యం రాజేశ్‌. 

Updated Date - 2022-08-17T07:02:52+05:30 IST