Kalapuram: పవన్‌కల్యాణ్‌ చేతులమీదుగా ట్రైలర్‌

Twitter IconWatsapp IconFacebook Icon
Kalapuram: పవన్‌కల్యాణ్‌ చేతులమీదుగా ట్రైలర్‌

‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’  చిత్రాలతో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్‌ (Karuna kumar)ఈసారి భిన్నమైన కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో వస్తున్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘కళాపురం’(Kalapuram). ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అన్నది ఉపశీర్షిక. ఆగస్ట్‌ 26న సినిమా విడుదలవుతోంది. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి (Rajani talluri)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ అట్లూరి కీలక పాత్రధారులు. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)విడుదల చేశారు. అనంతరం చిత్రం సక్సెస్‌ కావాలని బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. (Kalapuram trailer by pawan kalyan)

‘‘ఓ దర్శకుడు, నిర్మాత కలిసి సినిమా చేయాలనుకుంటారు. తాను ఉంటున్న కళాపురం గ్రామంలో కొంత సినిమా షూటింగ్‌ చేయాలనే కండీషన్‌ మీద నిర్మాత సినిమాను ప్రారంభిస్తాడు. అయితే డబ్బు కోసం మధ్యలో పోలీసులు, విలన్‌ ఎంట్రీ ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు, నిర్మాత కలిసి సినిమాను ఎలా పూర్తి చేశారనేదే సినిమా’’ అని దర్శకుడు చెప్పారు. ఒక నిమిషం 57 సెకెన్ల ఈ ట్రైలర్‌ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు ఎదురయ్యే సవాళ్లను కామెడీ కోణంలో ఆవిష్కరించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 


Kalapuram: పవన్‌కల్యాణ్‌ చేతులమీదుగా ట్రైలర్‌


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.