SVP: ‘క‌ళావ‌తి’.. దొంగ.. అందంగా.. నా పొగరుని దోచావే..!

ABN , First Publish Date - 2022-02-13T22:12:44+05:30 IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు సరసన ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన

SVP: ‘క‌ళావ‌తి’.. దొంగ.. అందంగా.. నా పొగరుని దోచావే..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు సరసన ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ని ఆదివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్. త‌మ‌న్ స్వ‌ర‌పరిచిన ఫ‌స్ట్‌ సింగిల్ కళావతి ప్రోమో ఇటీవ‌ల విడుద‌లై.. ఫుల్ సాంగ్ కోసం అంద‌రూ ఎదురు చూసేలా చేసింది. వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌గా ఈ రోజు కళావతి ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్, సింగ‌ర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలవడం ఖాయం అనేలా ఉంది. ఈ పాటలో అన్ని ఫ‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. మహేష్ బాబు హుక్ స్టెప్.. అభిమానులకి పండగే అని చెప్పుకోచ్చు. అలాగే మహేష్ బాబు, కీర్తి సురేష్ మరింత అందంగా ఈ పాటలో కనిపిస్తున్నారు. వారి కెమిస్ట్రీ ఈ పాటకు అదనపు గ్లామర్ జోడించింది. సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్ మ‌ధి విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇంకా త‌మన్, సిద్ శ్రీరామ్ మరియు సంగీత బృందం సంప్రదాయ గెటప్‌లలో.. ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజిక్ వీడియో ఈ పాటకు మ‌రింత అందాన్ని తెచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది.



Updated Date - 2022-02-13T22:12:44+05:30 IST