Kajal Agarwal : మళ్లీ తెరపైకి వచ్చేందుకు ప్లాన్ ?

ABN , First Publish Date - 2022-06-07T18:41:21+05:30 IST

దక్షిణాదిన దాదాపు పద్దెనిమిదేళ్ళుగా కథానాయికగా సత్తాచాటుతోంది అందాల కాజల్ అగర్వాల్ (Kajal Agarwal). ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం అమ్మడి ప్రత్యేకతలు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అగ్ర కథానాయకులందరి సరసన నటించిన మెప్పించిన ఈ సుందరి ఇప్పటికీ ఇంకా టాప్ లీడ్ లోనే హవా కొనసాగిస్తోంది.

Kajal Agarwal : మళ్లీ తెరపైకి వచ్చేందుకు ప్లాన్ ?

దక్షిణాదిన దాదాపు పద్దెనిమిదేళ్ళుగా కథానాయికగా సత్తాచాటుతోంది అందాల కాజల్ అగర్వాల్ (Kajal Agarwal). ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం అమ్మడి ప్రత్యేకతలు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అగ్ర కథానాయకులందరి సరసన నటించిన మెప్పించిన ఈ సుందరి ఇప్పటికీ ఇంకా టాప్ లీడ్ లోనే హవా కొనసాగిస్తోంది. రెండేళ్ళక్రితం బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూ (Gowtham Kichlu) ని పెళ్ళాడిన కాజల్..  ఈ ఏడాది ఏప్రిల్లో పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం కాజల్, గౌతమ్ దంపతులు తమ జీవితంలోని మూడో వ్యక్తి రాకకు ఆనంద పరవశులవుతున్నారు.  


కథానాయికగా స్థిరపడిన పలువురు ముద్దుగుమ్మలు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తిరిగి సినిమాలవైపుకు రాలేదు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అలా అనుకోవడం లేదు. వివాహం అనేది జీవితంలో ఒక మధురఘట్టం. పెళ్ళైనంత మాత్రాన సినిమాలు చేయకూడదనే రూల్ ఎక్కడా లేదు కదా.. ఈ విషయంలో గౌతమ్ కిచ్లూ నుంచి ఆమెకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవ్వలేదు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు కరీనా (Kareena), దీపికా (Deepika), ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), ఆలియా భట్ (Alia Bhatt) లాంటి వారు పెళ్ళయిన తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. సమంత (Samantha) సైతం పెళ్ళయ్యాకా, చైతూ (Chaithu)తో విడిపోయాకా కూడా సినిమాల్లో నటించడం మానలేదు. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ సైతం తిరిగి తెరపైకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోందని టాక్. ఇప్పటికే కాజల్ మేనేజర్, ఏజెంట్స్ ఆమె రీఎంట్రీకి సరిపడే సరైన కథకోసం చూస్తున్నారట. 


అలాగే.. వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా మంచి కథలు కోసం చూస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాస్తంత లావుగా మారిన కాజల్.. ప్రస్తుతం తన శరీరాన్ని తిరిగి యధా స్థానంలోకి తీసుకురావడానికి కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా వెయిట్ లాస్ అయి .. సినిమాల్లో నటించాలని చూస్తోందట. పలువురు దర్శక నిర్మాతలు కాజల్‌తో సినిమాలు చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు వినికిడి. మరి కాజల్ ఎప్పుడు మళ్ళీ కెమేరా ముందుకొచ్చి.. అభిమానుల్ని అలరిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-06-07T18:41:21+05:30 IST