Kajal Agarwal: 'ఇండియన్ 2'తో మళ్ళీ తెరపైకి..

ABN , First Publish Date - 2022-08-05T19:33:56+05:30 IST

ఉలగ నాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indian 2) మూవీతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నారు కాజల్ అగర్వాల్ (Kajal Agarwal).

Kajal Agarwal: 'ఇండియన్ 2'తో మళ్ళీ తెరపైకి..

ఉలగ నాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indian 2) మూవీతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నారు కాజల్ అగర్వాల్ (Kajal Agarwal). తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. 1996లో వచ్చిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం వరకు షూటింగ్ ఈ పూర్తి చేసుకుంది. 


అయితే, సెట్స్ లో జరిగిన ప్రమాదం వల్ల ముగ్గురు టెక్నీషియన్లు మరణించడంతో పాటు దర్శకనిర్మాతల మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఇరువురి మధ్యన రాజీ కుదరడంతో మళ్ళీ ఇండియన్ 2 ని మొదలుపెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఇటీవల కాజల్ అగర్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై ఆమె తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లైవ్ ఛాట్‌లో క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13 నుంచి ఇండియన్ 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు కాజల్ తెలిపారు. 


దీంతో ఇన్నాళ్ళు ఇండియన్ 2 నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకుందని వస్తున్నవన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది. కాగా, చివరిగా 'హే సినామిక' సినిమాలో నటించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె ఓ బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే నాగార్జున సరసన నటించాల్సిన 'ది ఘోస్ట్' సినిమా నుంచి కాజల్ తప్పుకున్నారు. ఇక కాజల్ మళ్ళీ ఇండియన్ 2 లాంటి భారీ పాన్ ఇండియా సినిమా ద్వారా రాబోతున్న విషయం తెలిసి అభిమానులు ఆనందపడుతున్నారు. ఇక ఈ మూవీలో సుకన్య, సిద్ధార్ధ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ ప్రసాద్, బాబీ సింహ, సముద్రఖని, ఢిల్లీ గణేశ్, వెన్నెల కిషోర్.. ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడు.   

Updated Date - 2022-08-05T19:33:56+05:30 IST