Hrithik Roshan సినిమా సూపర్ హిట్ అవ్వడం.. ఆయన తండ్రి Rakesh Roshan ప్రాణాల మీదకి తెచ్చిందని తెలుసా?.. అప్పట్లో ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-12T17:52:19+05:30 IST

ఒకప్పటి పాపులర్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గుల్షన్ కుమార్‌ని 1997లో కొందరు దుండగులు హత్య చేశారు. అది మరవకముందే కొన్నేళ్ల తర్వాత..

Hrithik Roshan సినిమా సూపర్ హిట్ అవ్వడం.. ఆయన తండ్రి Rakesh Roshan ప్రాణాల మీదకి తెచ్చిందని తెలుసా?.. అప్పట్లో ఏం జరిగిందంటే..

ఒకప్పటి పాపులర్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గుల్షన్ కుమార్‌ని 1997లో కొందరు దుండగులు హత్య చేశారు. అది మరవకముందే కొన్నేళ్ల తర్వాత అంటే జనవరి 21, 2000లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ రాకేశ్ రోషన్‌పై హత్యాయత్నం చేశారు. ఆ కాల్పుల్లో ఆయన ఛాతీలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లగా.. గంట ఆపరేషన్ తర్వాత ఆయన ప్రమాదం నుంచి బయట పడ్డారు. అసలేం జరిగిందంటే.. 


అప్పటికి కొన్ని నెలల ముందే రాకేశ్ కొడుకు హృతిక్ రోషన్ ‘కహో నా ... ప్యార్ హై’ సినిమాతో బాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అనంతరం హృతిక్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కబీ ఖుషీ కబీ గమ్’ అనే సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఆ తరుణంలో హృతిక్ అక్కడి ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూలో ఇచ్చాడు. అందులో హృతిక్ మాట్లాడుతూ.. ‘మా నాన్న సినిమా చేసేందుకు చాలా డబ్బు అప్పుగా చేశాడు. అయితే.. మా అదృష్టం కొద్ది ఆ మూవీ గత ఐదారు సంవత్సరాల్లో ఏ సినిమా సాధించలేనంత పెద్ద హిట్ అయ్యింది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ మూవీ వల్ల రాకేశ్‌కి చాలా డబ్బు వచ్చి ఉంటుందని అండర్ వరల్డ్ పసిగట్టింది. అందుకే ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నారు.


జనవరి 21, 2000న సాయంత్రం, ముంబైలోని శాంతాక్రూజ్ వెస్ట్‌లోని తిలక్ రోడ్‌లోని ఆయన కార్యాలయం సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రాకేశ్‌పై కాల్పులు జరిపారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకటి ఆయన ఎడమ చేతిలోకి.. మరోకటి ఆయన ఛాతీలోకి దూసుకెళ్లాయి. అనంతరం రాకేశ్‌ని ముంబైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గంట ఆపరేషన్ తర్వాత విజయవంతంగా రెండు బుల్లెట్లను తీసేయగలిగారు. దీంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.


అనంతరం విచారణలో సునీల్ విఠల్ గైక్వాడ్, సచిన్ కాంబ్లే అనే వ్యక్తులు రాకేశ్‌పై కాల్పులకు తెగబడ్డారని పోలీసులు గుర్తించారు. బహ్రెయిన్‌కు చెందిన గ్యాంగ్‌లార్డ్ అలీ బుదేష్, యూపీ డాన్ శుభాష్ సింగ్ ఠాకూర్‌తో కలిసి దావూద్ ఇబ్రహీం సపోర్టుతో ఈ హత్యాయత్నానికి పన్నాగం పన్నినట్లు తెలిసింది. దానికి ముఖ్య కారణం ‘కహో నా... ప్యార్ హై’ ఓవర్సీస్ సంపాదనలో వాటా కోసం అలీ బుదేశ్ గ్యాంగ్ నుంచి వచ్చిన డిమాండ్లను రాకేష్ రోషన్ వ్యతిరేకించినందువల్లే ఆయనపై దాడికి పాల్పడ్డారు. అయితే.. నివేదికల ప్రకారం, ఈ దాడి రాకేశ్‌ని భయపెట్టడానికి మాత్రమే తప్పు.. నిజంగా చంపాలని చేయలేదని తరువాత తెలిసింది. అయితే.. రాకేశ్‌కి అపాయం నుంచి బయటపడడంతో ఎంతోమంది ఆయన అభిమానులు, సన్నిహితులు అప్పట్లో సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-12T17:52:19+05:30 IST