సింగర్‌ను పెళ్లాడబోతోన్న ‘కబీర్ సింగ్’ హీరోయిన్..?

ABN , First Publish Date - 2022-03-12T00:14:31+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘కబీర్ సింగ్’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి

సింగర్‌ను పెళ్లాడబోతోన్న ‘కబీర్ సింగ్’ హీరోయిన్..?

బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘కబీర్ సింగ్’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులకు చేరువైన నటి నిఖితా దత్తా. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. సింగర్‌తో కలిసి ఏడడుగులు వేయనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ సింగర్ జుబిన్ నౌటియాల్‌ను నిఖితా పెళ్లాడబోతున్నట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఈ విషయంపై ఇప్పటికే చర్చించుకున్నట్టు సమాచారం. జుబిన్ స్వస్థలమైన ఉత్తరాఖండ్‌లో ఈ చర్చలు జరిగినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.  


గతంలో నిఖితా దత్తా, జుబిన్ నౌటియల్ జంటగా అనేకసార్లు డిన్నర్ డేట్లకు బయటకు వచ్చి మీడియా కంట పడ్డారు. కొన్ని రోజుల క్రితమే ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్టులో కూడా దర్శనమిచ్చారు. ఒకరి సోషల్ మీడియా అకౌంట్‌లో మరొకరు గతంలో అనేకసార్లు కామెంట్ చేశారు. దీంతో త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిఖితా దత్తా ‘కబీర్ సింగ్’ చిత్రంలో షాహిద్ ప్రేమికురాలిగా నటించింది. ఈ మూవీలో జుబిన్ ఓ పాట ఆలపించాడు. ఆ సినిమా సెట్లోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందట.

Updated Date - 2022-03-12T00:14:31+05:30 IST