K.Rajan: చిన్న చిత్రాలే సినీ కార్మికులకు అన్నం పెట్టేది..

ABN , First Publish Date - 2022-08-21T18:07:13+05:30 IST

చిత్ర పరిశ్రమను ఆదుకునేది, సినీ నిర్మాణ కార్మికులకు అన్నం పెడుతున్నది చిన్న బడ్జెట్‌ చిత్రాలేనని సీనియర్‌ సినీ నిర్మాత, నటుడు కె.రాజన్‌ (K Rajan) అన్నారు. రాజీవ్‌ గాంధీ నిర్మాణ సారథ్యంలో తిరుపూరు కుమరన్‌ దర్శకత్వంలో

K.Rajan: చిన్న చిత్రాలే సినీ కార్మికులకు  అన్నం పెట్టేది..

చిత్ర పరిశ్రమను ఆదుకునేది, సినీ నిర్మాణ కార్మికులకు అన్నం పెడుతున్నది చిన్న బడ్జెట్‌ చిత్రాలేనని సీనియర్‌ సినీ నిర్మాత, నటుడు కె.రాజన్‌ (K Rajan) అన్నారు. రాజీవ్‌ గాంధీ నిర్మాణ సారథ్యంలో తిరుపూరు కుమరన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కుందన్ మలై’ (Kundan Malai) చిత్రం ఆడియోను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను రిలీజ్‌ చేసి, చిత్ర బృందానికి తమ అభినందనలు తెలిపారు. 


ఈ సందర్భంగా నిర్మాత కె.రాజన్‌ మాట్లాడుతూ.. ‘అనేక చిత్రాల షూటింగ్‌లు పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ 75 శాతం తమిళ గడ్డపై చేయడాన్ని అభినందిస్తున్నాను. చిన్న బడ్జెట్‌ చిత్రాలే పరిశ్రమను రక్షించేది. అలాంటి చిత్రాల వల్లే వేలాది మంది సినీ కార్మికులు జీవనం సాగిస్తున్నారు’ అని అన్నారు. నిర్మాత రాజీవ్‌ గాంధీ మాట్లాడుతూ..ముందు అనుకున్న బడ్జెట్‌ కంటే దాటిపోయింది. అయినప్పటికీ ప్రతి ఒక్కరి శ్రమతో సినిమా బాగా వచ్చింది’ అని అన్నారు. గిల్డ్‌ అధ్యక్షుడు జాగువార్‌ తంగం మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రాల నిర్మాతల కోసం ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించాం. ఇందులో మంచి చిత్రాలను విడుదల చేస్తాం’ అని చెప్పారు. 


సంగీత దర్శకుడు శంకర్‌ గణేష్‌ మాట్లాడుతూ.. ‘కష్టపడేవారు వృద్ధిలోకి వస్తారన్న నానుడి ఉంది. అందుకు నిదర్శనమే ఈ చిత్ర బృందం’ అని తెలిపారు. అలాగే, కెమెరామెన్‌ అన్నై సెల్వ, నటుడు మహేంద్రన్‌, నటి సోనియా, నటుడు అంగముత్తు, నిర్మాత అజయ్‌ అరుణ్‌, దర్శకుడు భారతీగణేశన్‌, సంగీత దర్శకులు ధినా, రాజేష్‌ స్వామినాథన్‌, నటుడు రంజన్‌ కుమార్‌, దర్శకుడు ఫాలి శ్రీరంగం, హీరోయిన్‌ వెన్మది తదితరులు మాట్లాడారు.  

Updated Date - 2022-08-21T18:07:13+05:30 IST