K Raghavendrarao: అబద్దాలు రాయటం అనర్థం–నిజాలు రాయటానికి భయం

ABN , First Publish Date - 2022-05-23T01:14:24+05:30 IST

80 ఏళ్ల జీవితం... దర్శకుడిగా 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం 100కు పైగా చిత్రాలు.. ఈ జర్నీలో ఎన్నో ఎత్తు పల్లాలు.. విజయాలు... అపజయాలు అవార్డులు.. రివార్డులు.. ఇదీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్రాక్‌.

K Raghavendrarao: అబద్దాలు రాయటం అనర్థం–నిజాలు రాయటానికి భయం

80 ఏళ్ల జీవితం... 

దర్శకుడిగా 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం

100కు పైగా చిత్రాలు.. 

ఈ జర్నీలో ఎన్నో ఎత్తు పల్లాలు.. 

విజయాలు... అపజయాలు

అవార్డులు.. రివార్డులు.. 

ఇదీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K raghavendrarao)ట్రాక్‌. 

ఈ నెల 23, సోమవారం ఆయన 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ పుట్టినరోజు ప్రత్యేకను వివరిస్తూ ఆయన ఓ లేఖ రాశారు. అందులో ఆసక్తికర విషయాలు తెలిపారు. దర్శకుడిగా సినిమాతో ఆయన అటాచ్‌మెంట్‌ను తెలియజేస్తూ ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ అనే పుస్తకాన్ని రాసినట్లు చెప్పుకొచ్చారు. 


‘‘ఈ పుట్టినరోజు స్పెషల్‌ ఏంటంటే.. డైరెక్టర్‌గా వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఆ అనుభవంతోనే పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం. ఆ రోజు ఇంకా నా కళ్ల ముందే మెదులుతుంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి ఎన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌ కొట్టడంతో నా ప్రయాణం మొదలైంది. కమలాకర కామేశ్వరరావు గారు నాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. పదేళ్లు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.ఎస్‌ ప్రకాశ్‌రావు గారు నిర్మించిన ‘బాబు’ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించా. ఆ రోజు నుంచి నా జర్నీలో ఎన్నో విజయాలు, అపజయాలు, కష్ట, నష్టాలు, ఎత్తు పల్లాలు అవార్డులు, రివార్డులు ఎన్నో చూశాను. 



ఈ జర్నీ గురించి ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి. అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్థేశ్యంతో ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఆ పుస్తకంలో నేను నడిచిన దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు నన్ను నమ్మి నాతో నడిచిన నిర్మాతలు హీరోహీరోయిన్లు, రచయితలతోపాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతున్నాను. నేనీ స్థాయిలో ఉండటానికి 24 క్రాప్ట్‌లు, ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాలు గురించి ‘అబద్దాలు రాయటం అనర్థం, నిజాలు రాయటానికి భయం’ అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు. విప్పి చెప్పలేదు. కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం’’ అంటూ తన బుక్‌ గురించి చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.                  



Updated Date - 2022-05-23T01:14:24+05:30 IST