నాకు వయసు గుర్తుకు రాకపోవడానికి కారణమిదే: దర్శకేంద్రుడు

ABN , First Publish Date - 2022-05-29T23:50:55+05:30 IST

శ‌తాధిక చిత్ర ద‌ర్శకుడు.. ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు (K Raghavendra Rao) స‌మ‌ర్పణ‌లో.. యునైటెడ్ కె ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై సునీల్ (Sunil), అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (Anasuya Bharadwaj), బ్రహ్మానందం (Brahmanandam), వెన్నెల కిషోర్‌..

నాకు వయసు గుర్తుకు రాకపోవడానికి కారణమిదే: దర్శకేంద్రుడు

శ‌తాధిక చిత్ర ద‌ర్శకుడు.. ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు (K Raghavendra Rao) స‌మ‌ర్పణ‌లో.. యునైటెడ్ కె ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై సునీల్ (Sunil), అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (Anasuya Bharadwaj), బ్రహ్మానందం (Brahmanandam), వెన్నెల కిషోర్‌, స‌ప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా.. శ్రీధ‌ర్ సీపాన (Sreedhar Seepana) ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’ (Wanted PanduGod) . సాయిబాబా కోవెలమూడి (Saibaba Kovelamudi), వెంక‌ట్ కోవెలమూడి (Venkat Kovelamudi) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించి.. చిత్ర విశేషాలను తెలిపారు. 


ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘ఎంట‌ర్‌టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. జ‌నార్ధన మ‌హ‌ర్షి (Janardhan Maharshi) ఈ కథ నాకు వినిపించారు. హిలేరియ‌స్‌గా అనిపించింది. నిజానికి త‌నికెళ్ల భ‌ర‌ణి (Tanikella Bharani)గారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామ‌ని అనుకున్నారు. పెళ్లి సంద‌D  సినిమాకు శ్రీధ‌ర్ సీపాన అద్భుత‌మైన డైలాగ్స్‌ను రాశారు. దాంతో త‌నే ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తే బాగుంటుంద‌నిపించింది. పి.ఆర్ సంగీతం, మ‌హి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తుంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అందరూ ఈ వయసులో.. అని అంటుంటారు. ఇలాంటి యంగ్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేస్తుంటే నాకసలు వ‌య‌సే గుర్తుకు రాదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చ‌క్కగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌. జూన్ చివ‌రి వారం లేదా జూలై తొలి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు.


చిత్ర దర్శకుడు శ్రీధ‌ర్ సీపాన మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు ఏకైక దర్శకుడు రాఘవేంద్రరావుగారే. ఈ సినిమాతో నేను డైరెక్షన్ నేర్చుకున్నాను. ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌లా వ‌ర్క్ చేశాను. నా కంటే రాఘ‌వేంద్రరావుగారే ఎక్కువ టెన్షన్ ప‌డ్డారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఆయ‌న‌కే ద‌క్కుతుంది. నిర్మాత‌లు సాయిబాబా కోవెల‌మూడిగారికి, వెంక‌ట్ కోవెలమూడిగారికి అలాగే టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని తెలుపగా హీరో సునీల్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో పండు పాత్రలో న‌టించాను. ప్రేక్షకుల‌ను న‌వ్వించే సినిమా. ఫ్యామిలీ అంతా తెగ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. రైట‌ర్ జ‌నార్ధన మ‌హ‌ర్షి మాట్లాడుతూ ‘‘ఈ పండు గాడ్ సినిమాకు వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలోనే వంద సినిమాల‌కు పైగా ద‌ర్శక‌త్వం చేసిన ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావుగారు ‘నేను రాసిన ప్రేమ‌లేఖ’ అనే పుస్తకం రాశారు. ఈ సినిమా కంటే దానికే ఎక్కువ‌గా వ‌ర్క్ చేశాను. అంద‌రూ ఆ పుస్తకాన్ని చ‌ద‌వాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Updated Date - 2022-05-29T23:50:55+05:30 IST