మరో వెరైటీ కాన్సెప్ట్‌తో.. ‘థ్యాంక్ యు బ్రదర్’ బ్యానర్‌

ABN , First Publish Date - 2022-01-28T23:11:58+05:30 IST

అనసూయ, విరాజ్ అశ్విన్ నటించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ చిత్రం గత సంవత్సరం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి.. నొప్పులు పడుతున్న ఒక గర్భిణీ స్త్రీకి.. అదే లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి

మరో వెరైటీ కాన్సెప్ట్‌తో.. ‘థ్యాంక్ యు బ్రదర్’ బ్యానర్‌

అనసూయ, విరాజ్ అశ్విన్ నటించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ చిత్రం గత సంవత్సరం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి.. నొప్పులు పడుతున్న ఒక గర్భిణీ స్త్రీకి.. అదే లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి ఎలా సాయం చేశాడనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. జస్ట్ ఆర్డినరి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడదే టీమ్‌తో మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. 


ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో నటించిన నటీనటుల వివరాలను.. అలాగే చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ని త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా నిర్మాతలు తెలియజేశారు. ముందు మందు సరికొత్త కాన్సెప్ట్‌లతో మరిన్ని చిత్రాలను జస్ట్ ఆర్డినరి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-28T23:11:58+05:30 IST