HIT – The First Case: ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మూవీకి కొత్త రిలీజ్ డేట్..

ABN , First Publish Date - 2022-05-13T19:43:35+05:30 IST

ఒక భాషలో హిటైన సినిమాలు, మరో భాషలో రిమేక్ అవ్వడం మామూలే. అలా ఎన్నో సినిమాలు ఇతర భాషల నుంచి తెలుగులో..

HIT – The First Case: ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మూవీకి కొత్త రిలీజ్ డేట్..

ఒక భాషలో హిటైన సినిమాలు, మరో భాషలో రిమేక్ అవ్వడం మామూలే. అలా ఎన్నో సినిమాలు ఇతర భాషల నుంచి తెలుగులో, తెలుగు నుంచి ఇతర భాషల్లో రిమేక్ అయ్యాయి. అయితే.. ఇటీవల ఎక్కువగా తెలుగులో మంచి హిట్ సాధించిన సినిమాలు బాలీవుడ్‌లో రిమేక్ అవుతున్నాయి. అందులో.. ఇప్పటికే అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100, జెర్సీ అక్కడ రిమేకులుగా బాలీవుడ్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి.


తాజాగా విశ్వక్ సేన్ నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ కూడా హిందీలో రీమేక్ అవుతోంది. తెలుగు మాతృకకి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఆ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు. తెలుగులో హీరో నాని నిర్మించిన ఈ మూవీని బాలీవుడ్‌లో ‘దిల్’ రాజు (Dil Raju), టి సిరీస్ (T series) అధినేత భూషణ్  కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో.. రాజ్‌కుమార్ రావు, ‘దంగల్’ ఫేమ్ సాన్యా మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిందీలో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిజానికి.. ఈ మూవీని మే 20న విడుదల చేయాలని మూవీ టీం భావించింది. డేట్‌ని సైతం అనౌన్స్ చేసింది. ఏమైందో తెలియదు కానీ.. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.



Updated Date - 2022-05-13T19:43:35+05:30 IST