యంగ్ టైగర్ చేతుల్లోకి ‘రౌడీ బాయ్స్’

ABN , First Publish Date - 2022-01-08T00:31:32+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘రౌడీ బాయ్స్’ మూవీ ట్రైలర్ విడుదల కాబోతోంది. జనవరి 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిత్ర ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో

యంగ్ టైగర్ చేతుల్లోకి ‘రౌడీ బాయ్స్’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘రౌడీ బాయ్స్’ మూవీ ట్రైలర్ విడుదల కాబోతోంది. జనవరి 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిత్ర ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు ప్రేక్ష‌కులకు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుండి ఈ చిత్రంతో ఆశిష్ (శిరీష్ త‌న‌యుడు) హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

Updated Date - 2022-01-08T00:31:32+05:30 IST