Jr NTR: బాబాయి సినిమా తరువాత అబ్బాయి సినిమా రచ్చ రచ్చే

ABN , First Publish Date - 2022-09-22T19:18:37+05:30 IST

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా చెన్నకేశవ రెడ్డి (Chennakesava Reddy) సినిమా ఈ వారాంతంలో విడుదల అవుతోంది. ఈ సినిమాకి వున్న డిమాండ్ చూసి, నిర్మాత బెల్లంకొండ సురేష్, జూనియర్ ఎన్ఠీఆర్ (Junior NTR) నటించిన 'ఆది' (Aadi) సినిమాను కూడా మళ్ళీ విడుదల (re-release) చెయ్యాలని అనుకుంటున్నాడు.

Jr NTR: బాబాయి సినిమా తరువాత అబ్బాయి సినిమా రచ్చ రచ్చే

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా చెన్నకేశవ రెడ్డి (Chennakesava Reddy) సినిమా ఈ వారాంతంలో  విడుదల అవుతోంది. ఈ సినిమాకి వున్న డిమాండ్ చూసి, నిర్మాత బెల్లంకొండ సురేష్, జూనియర్ ఎన్ఠీఆర్ (Junior NTR) నటించిన 'ఆది' (Aadi) సినిమాను కూడా మళ్ళీ విడుదల (re-release) చెయ్యాలని అనుకుంటున్నాడు. ఆది సినిమా కూడా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఆ సినిమాని దీపావళి పండుగకి మళ్ళీ విడుదల చెయ్యాలని అనుకుంటున్నాని సురేష్ చెప్పాడు. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా. జూనియర్ ఎన్ఠీఆర్ ని స్టార్ ని చేసిన సినిమా కూడా. ఆ సినిమా చాల భారీగా విడుదల (Big Release) చెయ్యాలని కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే జూనియర్ ఎన్ఠీఆర్ (Junior NTR) అభిమానులు (fans) నిర్మాతతో మంతనాలు చేస్తున్నట్టు బోగట్టా. ట్రిపిల్ ఆర్ (RRR film) సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకోవటమే కాకుండా, ఆస్కార్ (Oscar) రేసులో కూడా వున్న జూనియర్ ఎన్ఠీఆర్ 'ఆది' ఇప్పుడు విడుదల అయితే ఆ సినిమాకి సూపర్ రెస్పాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు విడుదల అవుతున్న చిన్న బడ్జెట్ సినిమాల కలెక్షన్స్ ఎంత ఉంటుందో ఈ పాత సినిమాలు ఒక్కరోజులో అంత కలెక్ట్ చేస్తూ ఉండటం నిజంగా ఆశ్చర్యమే. 


'ఆది' సినిమా జూనియర్ ఎన్ఠీఆర్ కి ఒక మాస్ ఇమేజ్ (Mass Image) తెచ్చిన సినిమా. అతను కుర్రాడిగా వున్నప్పుడే ఇంత పెద్ద సినిమా చెయ్యడమే కాకుండా, ఒక మాస్ రోల్ ని కారీ  చెయ్యడం అంటే మాటలు కాదు. వి వి వినాయక్ కి ఆది మొదటి సినిమా దర్శకుడిగా. అతను జూనియర్ ఎన్ఠీఆర్ ని చూపించిన విధానం అతని చేత అద్భుత నటన చేయించిన తీరు, అప్పట్లో 19 సంవత్సరాలు (19 year old Jr NTR) కూడా నిండని జూనియర్ ఎన్ఠీఆర్ కి ఈ సినిమా తో పెద్ద స్టార్ డమ్ (Stardom) తెచ్చింది. దర్శకుడు వినాయక్ కూడా చాల మంచి పేరు వచ్చింది. ఈ సినిమా నుండే పోరాట సన్నివేశాల్లో (Action scenes) టాటా సుమో వెహికల్స్ (Tata Sumo Vehilces) పెట్టి బాంబులు పేల్చి వాటిని పైకి ఎగరేసి మళ్ళీ కిందపడేటట్టు చేసాడు వినాయక్. ఇది ఒక ట్రెండ్ గా మారింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్. 

Updated Date - 2022-09-22T19:18:37+05:30 IST