రియాలిటీ షోలో బాలీవుడ్ నటుడిపై బాటిల్ పగలగొట్టిన కంటెస్టెంట్.. జాన్ రియాక్షన్‌కి అందరూ షాక్..

ABN , First Publish Date - 2022-03-27T18:09:08+05:30 IST

కొత్త సినిమా విడుదలకి ముందు చిత్రబృందం ఎంతలా ప్రమోషన్స్‌ చేస్తారో తెలిసిందే. టీవీ ఇంటర్వ్యూలకి వెళ్లడం..

రియాలిటీ షోలో బాలీవుడ్ నటుడిపై బాటిల్ పగలగొట్టిన కంటెస్టెంట్.. జాన్ రియాక్షన్‌కి అందరూ షాక్..

కొత్త సినిమా విడుదలకి ముందు చిత్రబృందం ఎంతలా ప్రమోషన్స్‌ చేస్తారో తెలిసిందే. టీవీ ఇంటర్వ్యూలకి వెళ్లడం, రియాలిటీ షోలకి వెళ్లడం మామూలే. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎటాక్’. ఈ నటులు త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రియాలిటీ షో ‘ఇండియన్ గాట్ టాలెంట్’లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోని సోనీ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


అందులో.. జాన్ అబ్రహం ఓ కంటెస్టెంట్‌తోపాటు స్టంట్స్ పాల్గొనగా.. ఓ కంటెస్టెంట్ ఆయన వీపుపై బాటిల్ పగలగొట్టాడు. దాంతో కోపగించుకున్న జాన్ అతన్ని లేపి పక్కనే ఉన్న టేబుల్‌ మీద విసిరేస్తాడు. అది చూసిన ప్రేక్షకులతోపాటు అక్కడే ఉన్న నటులు సైతం షాకయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఎంతోమంది నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-03-27T18:09:08+05:30 IST