తనను రహస్యంగా వీడియో తీయడం గమనించిన John Abraham.. ఆ తర్వాత అతడు చేసిన పనికి ఆశ్చర్యపోయిన నెటిజన్లు

ABN , First Publish Date - 2021-11-20T00:12:44+05:30 IST

యాక్షన్ చిత్రాల్లో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్న నటుడు జాన్ అబ్రహాం. తాజాగా అతడి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌గా మారింది

తనను రహస్యంగా వీడియో తీయడం గమనించిన John Abraham.. ఆ తర్వాత అతడు చేసిన పనికి  ఆశ్చర్యపోయిన నెటిజన్లు

యాక్షన్ చిత్రాల్లో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్న నటుడు జాన్ అబ్రహాం. తాజాగా అతడి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఆ వీడియోను షేర్ చేయడం మొదలెట్టారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం..


జాన్ అబ్రహాం తన స్నేహితుడు, కుక్కతో  రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. బైక్ మీద ఉన్న ఇద్దరు అభిమానులు అతడిని రహస్యంగా వీడియో తీయడం మొదలుపెట్టారు. తనను వీడియో తీయడం చూసిన జాన్ అబ్రహాం ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తన అభిమానులపై కోపాన్ని చూపెట్టకుండా ఫోన్‌ను వారి నుంచి లాక్కున్నాడు. అనంతరం వీడియోను రికార్డ్ చేస్తూ అందరికీ హాయ్ అని చెప్పాడు. ఆ అభిమానులను సైతం మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగాడు. 


జాన్ అబ్రహాం ప్రస్తుతం సత్యమేవజయతే-2 చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రానికి మిలాప్ జావేరీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 25న థియేటర్లల్లో విడుదల కానుంది.  అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా ఆ సినిమాలో అతడు కనిపించనున్నాడు. ఈ మూవీలో రాజీవ్ పిళ్లై, అనుప్ సోనీ, సాహిల్ వైద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.    

Updated Date - 2021-11-20T00:12:44+05:30 IST