ఐటెం సాంగ్స్ వల్ల చచ్చిపోయానంటోన్న John Abraham!

ABN , First Publish Date - 2022-04-01T04:31:30+05:30 IST

తన సినిమాలో ‘ఐటెం సాంగ్’ ఉందంటూ దర్శకనిర్మాతలు చెప్పగానే ‘ప్రాణం పోతుందని’ జాన్ అబ్రహాం చెప్పాడు. పలుమార్లు తన సినిమాలోని సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ తో...

ఐటెం సాంగ్స్ వల్ల చచ్చిపోయానంటోన్న John Abraham!

తన సినిమాలో ‘ఐటెం సాంగ్’ ఉందంటూ దర్శకనిర్మాతలు చెప్పగానే ‘ప్రాణం పోతుందని’ జాన్ అబ్రహాం చెప్పాడు. పలుమార్లు తన సినిమాలోని సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ తో జాన్ బాక్సాఫీస్ సక్సెస్ కొట్టాడు. మరీ ముఖ్యంగా, అతడి సినిమాల్లో నోరా ఫతేహి పాటలు, స్టెప్పులు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. కానీ, ఇంత ఉపయోగకరంగా ఉన్నా కూడా ‘స్పెషల్ సాంగ్స్’ పేరు చెబితే జాన్ అబ్రహాం హడలిపోతున్నాడు...


ఐటెం సాంగ్స్ పట్ల తన విముఖత వ్యక్తం చేస్తూ... తనని తాను గొప్పవాడిగా ఏం ఫీలవ్వటం లేదని చెప్పిన జాన్... ప్రత్యేక గీతాలు అనగానే మాత్రం మానసికంగా కృంగిపోతానని వాపోయాడు. తన సినిమాల్లో కొన్ని సార్లు అద్భుతమైన పాటలు వీనుల విందు చేశాయని అన్న ఆయన మరికొన్ని పరమ దారుణమైన పాటలు కూడా తనకు లభించాయని అన్నాడు. ఏ పాటలు ఎలా ఉన్నా కూడా కథతో సంబంధం లేకుండా వచ్చి పడే ఐటెం సాంగ్స్ తనకు అస్సలు నచ్చవని జాన్ చెప్పాడు. వాటి వల్ల తన సినిమాలకు పబ్లిసిటీ వచ్చినప్పటికీ ‘ఐటెం సాంగ్స్’ అంటే మాత్రం బీ-టౌన్ అందగాడికి అస్సలు ఇష్టం ఉండదట. చూడాలి మరి, ఐటెం సాంగ్స్ అనగానే ‘రామ రామ’ అంటూ చెవులు మూసుకుంటోన్న జాన్ అబ్రహాం ముందు ముందు వాటి జోలికి వెళతాడో లేదో... 

Updated Date - 2022-04-01T04:31:30+05:30 IST