Raviteja: శ్రీలీలా జింతాక్‌ వచ్చేది అప్పుడే!

ABN , First Publish Date - 2022-08-16T01:56:45+05:30 IST

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja), శ్రీలీలా(Srileela) జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ‘ధమాకా’ (Dhamaka) చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్ల పై తెరకెక్కుతున్న చిత్రమిది.

Raviteja:  శ్రీలీలా జింతాక్‌ వచ్చేది అప్పుడే!

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja), శ్రీలీలా(Srileela) జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ‘ధమాకా’ (Dhamaka) చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్ల పై తెరకెక్కుతున్న చిత్రమిది. భీమ్స్‌ సిసిరోలియో స్వరకర్త. ఈ చిత్రంలో ఫస్ట్‌ సింగిల్‌ ‘జింతాక్‌’ లిరికల్‌ వీడియో ఈ నెల 18, మధ్యాహ్నాం 12:01 గంటలకు విడుదల చేయనున్నారు. మాస్‌ నెంబర్‌గా రాబోతున్న ఈ పాట పోస్టర్‌లో రవితేజ సాంప్రదాయ దుస్తుల్లో ధరించి శ్రీలీలాను ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నారు.  పోస్టర్‌లో హీరోహీరోయిన్ల ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తుంటే జింతాక్‌ మాస్‌ డ్యాన్స్‌ నెంబర్‌గా ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తోంది. ‘డబుల్‌ ఇంపాక్ట్‌’ ట్యాగ్‌లైన్‌లో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


 





Updated Date - 2022-08-16T01:56:45+05:30 IST