టీజర్‌తో సిద్ధమవుతున్న ‘జిన్నా’

ABN , First Publish Date - 2022-08-20T05:30:00+05:30 IST

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ టీజర్‌ ఈ నెల 25న రిలీజ్‌ చేస్తున్నారు.

టీజర్‌తో సిద్ధమవుతున్న ‘జిన్నా’

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ టీజర్‌ ఈ నెల 25న రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగు సహా హిందీ, మలయాళ భాషల్లో టీజర్‌ విడుదల కానుంది. బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ ఈ చిత్రంలో పుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు సోషల్‌ మీడియాలో సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. పాయల్‌ రాజ్‌పుత్‌ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్‌ కథ, స్కీన్‌ప్లే అందిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు. 

Updated Date - 2022-08-20T05:30:00+05:30 IST