ఇలాంటి సీన్ తీసేశారేంటి?.. 3 సంవత్సరాల తర్వాత ‘జెర్సీ’ నుండి తొలగించిన సన్నివేశం

ABN , First Publish Date - 2022-04-19T23:13:53+05:30 IST

న్యాచురల్ స్టార్ నానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని విధంగా విజయాన్ని సాధించింది. 2019 ఏప్రిల్ 19న విడుదలైన

ఇలాంటి సీన్ తీసేశారేంటి?.. 3 సంవత్సరాల తర్వాత ‘జెర్సీ’ నుండి తొలగించిన సన్నివేశం

న్యాచురల్ స్టార్ నానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని విధంగా విజయాన్ని సాధించింది. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం.. హీరో నానిని నటుడిగా మరో మెట్టు ఎక్కించింది. ‘జెర్సీ’ చిత్రం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ సినిమా నుండి తొలగించిన సన్నివేశాన్ని నేడు(మంగళవారం) విడుదల చేశారు. మూడు సంవత్సరాల తర్వాత తొలగించిన సన్నివేశం విడుదల చేయడం.. ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కానీ ఈ సన్నివేశాన్ని చూస్తే మాత్రం.. ‘అర్రె.. ఇలాంటి సీన్ తీసేశారేంటి? అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. ఈ సన్నివేశంలో.. 


‘‘అర్జున్ (నాని)కి అతని భార్య తండ్రి (సంజయ్ స్వరూప్) కొంత డబ్బు ఇచ్చి.. క్రికెట్ ఎప్పుడు పడితే అప్పుడు ఆడేది కాదు.. పోయి జాబ్ చేసుకోమని కోరతాడు. అర్జున్‌ని అవమానపరిచేలా కొన్ని కామెంట్స్ చేస్తాడు. కానీ, అర్జున్ మాత్రం ఇవేమీ లెక్క చేయకుండా.. తన ఆటతోనే సమాధానం చెబుతాను అనేలా వెళ్లిపోతాడు..’’. నిజంగా ఈ సీన్ సినిమాలో ఉండాల్సింది. అర్జున్ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసేలా గౌతమ్ ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాడు. కానీ సినిమాలో మాత్రం ఈ సన్నివేశానికి చోటు దక్కలేదు. ‘జెర్సీ’ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు.. సక్సెస్ అవ్వకపోయినా, ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది.. అని చివరిలో చెప్పే సన్నివేశంతో దర్శకుడు ప్రతి ఒక్కరినీ సినిమాకి కనెక్ట్ చేయడంతో.. సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రోనిత్, సత్యరాజ్ వంటి వారు ఇతర పాత్రలలో నటించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించారు.





Updated Date - 2022-04-19T23:13:53+05:30 IST