బాలీవుడ్ Jersey ఎలా ఉంది..? Shahid Kapoor సినిమాను చూసిన ప్రేక్షకుల రెస్పాన్స్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-04-21T18:34:48+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సెన్సేషనల్ హిట్ ‘కబీర్ సింగ్’ తర్వాత నటించిన చిత్రం ‘జెర్సీ’. టాలీవుడ్ యువ నటుడు నాని..

బాలీవుడ్ Jersey ఎలా ఉంది..? Shahid Kapoor సినిమాను చూసిన ప్రేక్షకుల రెస్పాన్స్ ఇదీ..!

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సెన్సేషనల్ హిట్ ‘కబీర్ సింగ్’ తర్వాత నటించిన చిత్రం ‘జెర్సీ’. టాలీవుడ్ యువ నటుడు నాని ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ సినిమా ‘జెర్సీ’కి ఇది రిమేక్. తెలుగు మాతృకకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరే ఈ హిందీ మూవీకి సైతం డైరెక్టర్. కోవిడ్ పరిస్థితులు, ఇతర కారణాల పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. దీనికి ఒకరోజు ముందే బాలీవుడ్ ప్రముఖులు, మీడియా కోసం చిత్ర బృందం ప్రత్యేక స్క్రీనింగ్‌ని ఏర్పాటు చేసింది. దీనికి కృతిసనన్, పూజా హెగ్డే, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యారాయ్ కపూర్ వంటి పలువురు బీ-టౌన్ సెలబ్రిటీలతోపాటు సినీ విశ్లేషకులు సైతం హాజరయ్యారు.


ఈ తరుణంలో ఈ సినిమా గురించి, షాహిద్ కపూర్ ఫర్ఫామెన్స్ గురించి పలువురు సినీ విశ్లేషకులు పొగుడుతూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు. ఆ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో.. ‘ఒకే హృదయాన్ని ఎన్నిసార్లు కొల్లగొడతారు. షాహిద్ కపూర్ నటన అదిరిపోయింది. జెర్సీ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని ఓ సినీ విశ్లేషకురాలు రాసుకొచ్చారు.


అలాగే మరో ట్వీట్‌లో.. ‘ఈ దశాబ్దకాలంలో వచ్చిన బెస్ట్ ఎమోషనల్ మూవీ జెర్సీ.. మీ విలువైన సమయాన్ని ఈ షాహిద్ కపూర్‌ సినిమా చూడడానికి వెచ్చించవచ్చు. అందులో ఏ మాత్రం తప్పులేదు. తండ్రి కొడుకులు పంకజ్‌కపూర్, షాహిద్ కపూర్‌ చాలా బాగా నటించారు.. ఈ మూవీ మీ అందరికి నచ్చాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ విశ్లేషకుడు రాసుకొచ్చారు.


అంతేకాకుండా యూఏఈ సెన్సార్ బోర్డు నుంచి రివ్యూ ఒకటి బయటికి వచ్చింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఉమైర్ సంధు చేసిన ఆ పోస్ట్‌లో.. ‘ యుఎఇ సెన్సార్ బోర్డ్ నుంచి జెర్సీ రివ్యూ. షాహిద్ కపూర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనను చాలా సులభంగా ఇచ్చాడు. ఆయన సినిమా కోసం క్రికెట్ శిక్షణ తీసుకున్నాడు. అది సినిమాలో ఓ క్రికెటర్‌గా ఆయన బాడీ లాంగ్వేజ్‌లో కనిపిస్తోంది’ అని రాసుకొచ్చారు. అలాగే మరికొందరూ సైతం ఈ మూవీలో షాహిద్ యాక్టింగ్ ఇరగదీశాడని, సినిమా సూపర్ అంటూ ట్వీట్స్ చేశారు.











Updated Date - 2022-04-21T18:34:48+05:30 IST