తల్లి కాబోతున్న Jennifer Lawrence.. న్యూయార్క్ వీధుల్లో భర్తతో కలిసి దేనికోసం వెతుకుతోందంటే..

ABN , First Publish Date - 2021-12-20T00:07:55+05:30 IST

హాలీవుడ్ పాప్యులర్ యాక్ట్రస్ జెన్నీఫర్ లారెన్స్ న్యూ యార్క్ నగర వీధుల్లో తిరగాడుతూ పాపరాజీ కెమెరాల కంటపడింది. ఆమె తన భర్తతో కలసి...

తల్లి కాబోతున్న Jennifer Lawrence.. న్యూయార్క్ వీధుల్లో భర్తతో కలిసి దేనికోసం వెతుకుతోందంటే..

హాలీవుడ్ పాప్యులర్ యాక్ట్రస్ జెన్నీఫర్ లారెన్స్ న్యూ యార్క్ నగర వీధుల్లో తిరగాడుతూ పాపరాజీ కెమెరాల కంటపడింది. ఆమె తన భర్తతో కలసి కొత్త ఇంటి వేటలో ఉందని సమాచారం. త్వరలో తల్లి కాబోతోన్న 31 ఏళ్ల సీనియర్ నటికి, ఆర్ట్ డీలర్ అయిన ఆమె హజ్బెండ్‌కి ఓ ఏజెంట్ న్యూ యార్క్ నగరపు ఈస్ట్ విలేజ్ ఏరియాలో కొన్ని ప్రాపర్జీస్ చూపించాడట.

గతంలో ఆస్కార్ గెలుచుకున్న జెన్నీఫర్ లారెన్స్ కొన్నాళ్ల క్రితం వరకూ మాన్‌హట్టన్‌లో నివసించేది. అయితే, అక్కడ తనకున్న పెంట్‌హౌజ్‌ని ఆమె రీసెంట్‌గా 9.9 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. కాగా ఇప్పుడు న్యూ యార్క్‌లో స్వంత ఇల్లు కొనుక్కుని స్థిరపడాలని ఆలోచిస్తోంది. జెన్సీఫర్ లారెన్స్ ప్రస్తుతం గర్భవతి. త్వరలోనే బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని హాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. న్యూ యార్క్‌లో ప్రెగ్నెంట్‌గా మీడియా కెమెరాలకు కనిపించక ముందే ఆమె ‘డోంట్ లుక్ అప్’ సినిమా వరల్డ్ ప్రీమియర్ వేళ బేబీ బంప్‌తో సర్‌ప్రైజ్ చేసింది. ‘టైటానిక్’ స్టార్ లియనార్డో డికాప్రియోతో కలసి జెన్నీఫర్ లారెన్స్ ‘డోంట్ లుక్ అప్’ సినిమాలో నటించింది. త్వరలోనే అది విడుదల కానుంది...                                       


Updated Date - 2021-12-20T00:07:55+05:30 IST