Exclusive : బీజేపీ నుంచి బరిలో దిగనున్న Jeevitha Rajasekhar

ABN , First Publish Date - 2022-09-13T19:04:01+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో అయితే ఇంకా ఎక్కువగానే వుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బిజెపిని రోజూ ఘాటుగా విమర్శిస్తుంటే, బిజెపి వాళ్ళు కూడా దీటుగా సమాధానాలు ఇస్తున్నారు, అలాగే ఈసారి ఎలా అయినా తెలంగాణాలో పాగా వెయ్యాలని చూస్తున్నారు.

Exclusive : బీజేపీ నుంచి బరిలో దిగనున్న Jeevitha Rajasekhar

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో అయితే ఇంకా ఎక్కువగానే వుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బిజెపిని రోజూ ఘాటుగా విమర్శిస్తుంటే, బిజెపి (bjp)వాళ్ళు కూడా దీటుగా సమాధానాలు ఇస్తున్నారు, అలాగే ఈసారి ఎలా అయినా తెలంగాణాలో పాగా వెయ్యాలని చూస్తున్నారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో ఒకటి సినిమా నటీనటుల్ని తమ పార్టీలోకి ఆహ్వానించటం. ఆ మధ్య జూనియర్‌ ఎన్టీఆర్‌ని, తర్వాత నితిన్‌ని కలిశారు పార్టీ పెద్దలు. అలాగేఈ మధ్య బీజేపీ తెలంగాణ సారధి బండి సంజయ్‌ నటి, దర్శకురాలు నిర్మాత అయినా జీవిత రాజశేఖర్‌(Jeevitha rajasekhar)ను పార్టీలోకి ఆహ్వానించినట్టు ఒక బోగట్టా. జీవిత మొదటి నుంచీ బిజెపిలోనే వున్నా, మధ్యలో వై ఎస్‌ జగన్‌ బలవంతం మీద ఆ పార్టీ కి ప్రచారం చేసినట్టుగా తెలిసింది. ప్రచారం చేసినంత మాత్రాన ఆ పార్టీలో చేరిపోయినట్టు కాదని, ఆ పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోలేదని ఆమె అన్నట్టుగా తెలిసింది. అందుకే ఆమె, ఆమె భర్త  రాజశేఖర్‌ ఇద్దరూ బిజెపి లోనే ఉన్నామని, కానీ మీరే పట్టించుకోవటం లేదని, సంజయ్‌ కి చెప్పినట్టుగా తెలిసింది.



ప్రస్తుతం రాజకీయ పార్టీలు అన్నీ సినిమా వాళ్ళని ప్రచారాలకు వాడుకొని ఆ తరువాత వదిలేస్తున్నారని, అందుకే ఈసారి పోటీ చెయ్యడమో, లేదా ముందుగానే ఏదైనా ఒప్పదం చేసుకోవటమే మంచిది అన్న అభిప్రాయంలో చాలామంది నటీనటులు ఉన్నట్టు తెలిసింది. అదే విధంగా జీవిత కూడా బండి సంజయ్‌కి చెప్పారని తెలిసింది. ఎందుకంటే సంజయ్‌ పాదయాత్ర చేపట్టారు.  అలాగే జీవితను కూడా ప్రచారం చేయడానికి రమ్మని ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి జీవిత తాను బిజెపి నుండి ఎక్కడయినా పోటీ చెయ్యడానికి రెడీ అని, అది ముందు ఖరారు చేేస్త తాను వస్తానని లేకపోతే ఒక్క ప్రచారానికి అయితే రానని నిర్మోహమాటంమగా చెప్పినట్టు తెలిసింది. దీనికి బండి సంజయ్‌ అలోచించి చెప్మాతను అన్నట్లు టాక్‌ నడుస్తోంది. జీవిత మంచి వక్త, వున్నవాళ్లలో బాగా మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ బిజెపికి ఒక మాట్లాడే నాయకురాలు కావాలి, అందువల్ల జీవితని తీసుకోవటం బిజెపికి ప్లస్‌ అవుతుంది. కానీ ఆమె ప్రచారానికి వస్తా... కానీ పోటీ చేస్తా అంటోంది. మరి దీనికి  బీజేపీ  ఏమంటుందో చూడాలి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఎక్కడా అనేది తెలియాల్సి ఉంది. 

-సురేష్ కవిరాయని




Updated Date - 2022-09-13T19:04:01+05:30 IST