Jayasudha: ‘పద్మశ్రీ’లకు మేము పనికిరామా?

ABN , First Publish Date - 2022-07-30T00:38:42+05:30 IST

నటిగా విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే ఫ్లవర్ బొకే‌లైనా పంపిస్తారు.. ఇక్కడ (టాలీవుడ్) కనీసం అవి పంపించేవారు కూడా లేరు. అదే ఒక హీరో అయితే.. పెద్ద హడావుడి జరిగేది. చాలా మంది నాతో అన్నారు.. ఒక పెద్ద పార్టీ ఇవ్వవచ్చుగా అని..

Jayasudha: ‘పద్మశ్రీ’లకు మేము పనికిరామా?

‘‘నటిగా విజయవంతంగా  50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే ఫ్లవర్ బొకే‌లైనా పంపిస్తారు.. ఇక్కడ (టాలీవుడ్) కనీసం అవి పంపించేవారు కూడా లేరు. అదే ఒక హీరో అయితే.. పెద్ద హడావుడి జరిగేది. చాలా మంది నాతో అన్నారు.. ఒక పెద్ద పార్టీ ఇవ్వవచ్చుగా అని.. నాకు వద్దని అనిపించింది..’’ అని అన్నారు సహజనటి జయసుధ (Jayasudha). తాజాగా ఆమె  ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart With RK) కార్యక్రమంలో పాల్గొని.. అనేక విషయాలపై మాట్లాడారు. బాల నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ తిరుగులేని నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నటిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆమె.. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ వివక్ష ఉందని చెప్పడమే కాకుండా.. ‘మా’ బిల్డింగ్‌కి సంబంధించి కూడా ఈ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో.. 


-‘‘ఈ 50 సంవత్సరాల జర్నీలో ఇండస్ట్రీలో వివక్ష ఉందేమో అని అనిపించింది. బాగా సక్సెస్ అయిన పెద్ద హీరోలను ఒకలాగా ట్రీట్ చేయడం, హీరోల కంటే హీరోయిన్లను తక్కువగా చూడటం అనేది బాగా కనిపించింది. టాప్ హీరోయిన్ అయినప్పుడు.. ఇప్పుడు కూడా ఆ వివక్ష ఇంకా కనబడుతూనే ఉంది.


- ఇండస్ట్రీలో ఎక్కువగా డిమాండ్ చేసినా.. ఎక్కువగా ఇబ్బంది పెట్టినా.. ఇన్ని సంవత్సరాలు నన్ను ఉండనిచ్చేవారు కాదు.. ఎప్పుడో పంపించేవారు. 

-  ఎక్కడ నా వాయిస్ వినిపించాలో అక్కడ నా వాయిస్ ఖచ్చితంగా ఉంటుంది.

- ముంబై నుంచి వస్తే ఒకలా ట్రీట్ చేస్తున్నారు.. వాళ్ల కుక్క పిల్లలకి కూడా రూమ్స్ ఇస్తున్నారు. 

- డామినేషన్ అనేది హీరోలతో పెద్దగా ఉండదు.. వారి పక్కన ఉండేవారితోనే ప్రాబ్లమ్.

- శోభన్ బాబు (Sobhan Babu)గారిలా డబ్బులు నిల్వ చేసుకోవడం నేర్చుకోలేకపోయాను. ఆయన.. ఏమోయ్ అని అనేవారు. ‘ఏమోయ్.. నీకొక ప్లేస్ చూపిస్తాను.. మీ నాన్నగారితో చెప్పి కొనుక్కో’.. ఇలా చెప్పేవారు. 

- సావిత్రి (Savitri)గారి ‘మహానటి’ అప్పుడు తీసి ఉంటే బాగుండేది.

- అమెరికా వెళ్లే ముందు ఇక్కడ  ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ గోల భరించలేకే.. ఒక నెల అక్కడ ఉండిపోయాను.

- ‘మా’ (MAA) ఎన్నికలలో నాకు సపోర్ట్ చేయకుండా.. ఇంకెవరికి చేస్తుంది అని మోహన్ బాబు (Mohan Babu)‌గారు అన్నదాని గురించి చెప్పాలంటే.. నా 50 సంవత్సరాల సినీ కెరీర్ అంత ఉంటుంది.

- మురళీ మోహన్‌ (Murali Mohan)గారి టైమ్ నుండి ‘మా’ బిల్డింగ్ కడతామని చెబుతున్నారు. ఇంత వరకు కట్టలేదు. ఇంకో 25 సంవత్సరాలు నాకు కెరీర్ ఉంటే.. అప్పటికైనా ఆ బిల్డింగ్ రెడీ అవుతుందని ఆశిస్తున్నా. 

- చాలా మంది అడిగారు.. మీకెందుకు ‘పద్మశ్రీ’ (Padma Shri) రావడం లేదు అని. కంగనా రనౌత్‌కి కూడా ఈ మధ్య ఇచ్చారు. అంటే ఆ అమ్మాయితో ప్రభుత్వానికి ఏం అవసరం ఉందో మరి..’’ అని చెప్పుకొచ్చిన జయసుధ.. ఇంకా తను లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం, రాజకీయాల గురించి ఎన్నో విషయాలను ఈ షో (Open Heart With RK)లో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ వీడియో ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో... 



Updated Date - 2022-07-30T00:38:42+05:30 IST