Maa Building: జ‌య‌సుధ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ABN , First Publish Date - 2022-08-01T06:06:12+05:30 IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ భవనం అసలు మొదలవుతుందా? మొదలుపెడితే మరో పాతికేళ్ళకైనా పూర్తవుతుందా? ఆ దిశగా పనులు సాగుతున్నాయా? దీనిపై సహజనటి జయసుధ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఏం చెప్పారు. ఆ విషయాలు మీకోసం..

Maa Building: జ‌య‌సుధ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ భవనం అసలు మొదలవుతుందా? (Maa Building)

మొదలుపెడితే మరో పాతికేళ్ళకైనా పూర్తవుతుందా? 

ఆ దిశగా పనులు సాగుతున్నాయా? 

దీనిపై సహజనటి జయసుధ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఏం చెప్పారు. ఆ విషయాలు మీకోసం..(Jayasudha)

కరోనా సమయంలో ఓసీడీలాంటి సమస్యతో  ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. పిల్లలు స్పూన్‌ ఇస్తే... దాన్ని కూడా పదిసార్లు కడిగేదాన్ని. ఎందుకో అలా మానసికంగా ఇబ్బందిపడ్డా.  దాని నుంచి బయటకు రావడానికి ధైర్యం చేసి అమెరికా వెళ్లి రెండు నెలలు ఉందామనుకున్నా. ఎలాగూ మా ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా ఇక్కడ వీళ్ల గోల చూసి ఇంకో నెల అక్కడే ఉందామనుకున్నా. అయితే మా ఎన్నికలు ఉన్నాయని, తప్పించుకోవాలని అమెరికా వెళ్లలేదు. ఓటు ఎక్కడి నుంచైనా చేయవచ్చు. నాకు ఎవరి గురించి భయం లేదు. నా యాభై ఏళ్ల కెరీర్‌ ఎంత ఉందో ‘మా’ ఎన్నికల కథ కూడా అంతే ఉంటుంది. దాని గురించి రిలేషన్‌షిప్స్‌ పాడు చేసుకోవడం అవసరమా అనిపించింది. ఎందుకంటే మనం ఒక వయసుకు వచ్చిన తరువాత వేరొకరికి స్ఫూర్తిగా ఉండాల్సింది పోయి... పోట్లాడుకోవడం సరైంది కాదు. . ‘ఇది మా కుటుంబం’ అన్నవాళ్లు వేరొకరి గురించి బహిరంగంగా అస్సలు మాట్లాడకూడదు.  ‘మా’ ఎన్నికలపై కోట్ల రూపాయలు బెట్టింగ్‌ నడిచిందని చాలామంది చెప్పారు. ఆంధ్రాలో కోడి పందాల కంటే ఎక్కువ బెట్టింగ్‌లు కట్టారట. అనుకున్నవన్నీ జరగవు. (Maa association)


‘మా’ కోసం భవనం కడతామని మురళీమోహన్‌ (MUralimohan)అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి చెబుతున్నారు. ఇంకో పాతికేళ్లు నా కెరీర్‌ ఉంటే... అప్పటికైనా ఆ భవనం పూర్తవుతుందని ఆశిస్తున్నా! నేను 75 ఏళ్లు పూర్తి చేస్తానా లేదా అనేది ఆ దేవుడి దయ. అలాగే ‘మా’ భవనం కూడా!  పరిశ్రమలోని వారంతా తమ సంపాదనలో ఒక్క శాతం ఇస్తే భవనం నిర్మాణం ఇతరుల సాయం అవసరం లేకుండా కట్టుకోవచ్చు. ఇక్కడ కావల్సిందల్లా ఐక్యత. ఇక్కడున్న విపరీతమైన కుల పిచ్చిని చూసి భారతీయురాలిగా చాలా బాధపడతాను. పరిశ్రమలోనూ, బయట కూడా ఉంది’’ అని జయసుధ చెప్పుకొచ్చారు. (Jaya sudha comments on Maa building)


Updated Date - 2022-08-01T06:06:12+05:30 IST