Jayasudha: శోభన్‌బాబుకేమైంది అనుకున్నా.. ఈ రోజు అది వందల కోట్లు!

ABN , First Publish Date - 2022-08-01T18:25:50+05:30 IST

‘‘ ‘ఏమోయ్‌... నీకో ప్లేస్‌ చూపిస్తాను. మీ నాన్నగారికి చెప్పి అక్కడ కొనుక్కో’ అని శోభన్‌బాబు (Sobhan Babu)‌గారు చెప్పిన స్థలం చూడడానికి వెళితే.. అది డంపింగ్‌ యార్డ్‌. ‘ఈయనకేమైంది... ఇది చూపించి కొనమంటున్నారు’ అని అనుకున్నా..

Jayasudha: శోభన్‌బాబుకేమైంది అనుకున్నా.. ఈ రోజు అది వందల కోట్లు!

‘‘ ‘ఏమోయ్‌... నీకో ప్లేస్‌ చూపిస్తాను. మీ నాన్నగారికి చెప్పి అది కొనుక్కో’ అని శోభన్‌బాబు (Sobhan Babu)‌గారు చెప్పిన స్థలం చూడడానికి వెళితే.. అది డంపింగ్‌ యార్డ్‌. ‘ఈయనకేమైంది... ఇది చూపించి కొనమంటున్నారు’ అని అనుకున్నా. అప్పట్లో ఆయన చూపించిన స్థలం ఇప్పుడు వందల కోట్లు’’ అని సహజనటి జయసుధ తెలిపారు. తాజాగా ఆమె ABN ఆంధ్రజ్యోతి ‘Open Heart with RK’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల అవస్థలు, అలాగే అప్పట్లో శోభన్‌బాబు వర్క్ విధానం వంటి విషయాలను ఆమె షేర్ చేసుకున్నారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను కోరుకొనేదేమిటంటే అనుభవంతో పాటు వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి. అప్పటి కంటే ఇప్పుడు మరింత బాగా చూసుకోవాలి. నా విషయంలో నేను కచ్చితంగా ఉంటాను. నాకు ప్రత్యేకంగా వ్యానిటీ వ్యాన్‌ అడుగుతాను. ఎందుకంటే హీరో సెట్‌లోకి వచ్చేవరకు అందరూ వేచివుండాలి. ఆ హీరోకు డెబ్భై ఏళ్లవనీ... పదిహేడేళ్లవనీ! హీరోకు ఇచ్చే గౌరవం ఇవ్వండి. కానీ వయసులో పెద్దవాళ్లని పట్టించుకోండి. చాలాచోట్ల ఏమవుతుందంటే... హీరో కంటే కనీసం 45 నిమిషాలు ముందు మిగిలిన ఆర్టిస్టులను పిలుస్తారు. జూనియర్‌ ఆర్టి్‌స్టులకైతే కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. అలా నిలబడి ఉండాలి. ఒకసారి సెట్‌లో నేరుగా హీరోని పిలిచి చెప్పాను... ‘ఆర్టిస్టులను ఇలా ఇంత ముందుగా పిలిచి కూర్చోబెట్టడం సరైంది కాదు. ఎందుకు ఇంత వివక్ష? అందరం మనుషలమే కదా’ అన్నాను. ‘లేదు ఆంటీ... నాకు అస్సలు తెలియదు’ అన్నాడు అతను. ఆ తరువాత రోజు ప్రొడక్షన్‌ వాళ్లకి గట్టిగా చెప్పాడు... ‘అనవసరంగా తీసుకువచ్చి ఇలా కూర్చోబెట్టకండి’ అని.


ఒక విధంగా శోభన్‌బాబుగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన మంగళవారాలు షూటింగ్‌ చేసేవారు కాదు. ఎందుకని అడిగితే... ‘కాదోయ్‌... నేను లెక్కలన్నీ ఆ రోజు చూసుకొంటా’ అనేవారు. ఆయన్ని చూసే నేను కూడా నేర్చుకున్నాను. అయితే ఆయనలా పొదుపు, ఇన్వెస్ట్‌ చేయడం మాత్రం నేర్చుకోలేకపోయాను. ‘ఇక్కడ కొను... అక్కడ కొను’ అని ఆయన చెప్పేవారు. ఒకసారి కారులో ఇద్దరం వెళుతున్నప్పుడు... ‘ఏమోయ్‌... నీకో ప్లేస్‌ చూపిస్తాను. మీ నాన్నగారికి చెప్పి అది కొనుక్కో’ అన్నారు. వెళ్లి చూస్తే అది డంపింగ్‌ యార్డ్‌. ‘ఈయనకేమైంది... ఇది చూపించి కొనమంటున్నారు’ అనుకున్నా. ‘నీకు తెలియదు. లెవెలింగ్‌ కోసం ఇక్కడ డంపింగ్‌ చేస్తున్నారు’ అన్నారు. అదే ఈ రోజు చెన్నైలోని అన్నానగర్‌. ఇప్పుడు అక్కడ భూమి విలువ వందల కోట్లల్లో ఉంది..’’ అని జయసుధ చెప్పుకొచ్చారు. (Jayasudha Open Heart with RK)

Updated Date - 2022-08-01T18:25:50+05:30 IST