‘జయమ్మ పంచాయితీ’: కంటతడిపెట్టిస్తున్న ‘గొలుసు కట్టు ఘోషలు’

ABN , First Publish Date - 2022-04-26T02:08:55+05:30 IST

స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. మే 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవల

‘జయమ్మ పంచాయితీ’: కంటతడిపెట్టిస్తున్న ‘గొలుసు కట్టు ఘోషలు’

స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. మే 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. మ్యూజికల్ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా చిత్రంలోని ‘గొలుసు కట్టు ఘోషలు’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.  


ఈ పాట విషయానికి వస్తే.. మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ పాటని హృదయాన్ని కదిలించేలా కంపోజ్ చేశారు. వినగానే భావోద్వేగంతో కళ్ళు చమర్చేలా వుందీ పాట. చారు హరిహరన్, కీరవాణి ఈ పాటను హృదయాన్ని తాకేలా ఆలపించగా, చైతన్య ప్రసాద్ అర్ధవంతమైన సాహిత్యం అందించారు. కథలో కీలకమైన సందర్భంలో ఈ పాట ఉండబోతుందని సాహిత్యం వింటే అర్ధమౌతుంది. జయమ్మ పాత్రకు ఎదురయ్యే కష్టాన్ని, ఆ పాత్రలోని ఎమోషనల్ కోణాన్ని ఈ పాట ఆవిష్కరిస్తోంది. కాగా, వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.



Updated Date - 2022-04-26T02:08:55+05:30 IST