Jalsa 4k : ట్రెండింగ్‌లో ‘జాతిరత్నాలు’ డైలాగ్..

ABN , First Publish Date - 2022-09-02T15:10:13+05:30 IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తాజాగా విడుదలైన చిత్రాలకన్నా .. ఎప్పుడో పద్నాలుగేళ్ళ క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘జల్సా’ (Jalsa) నే ఎక్కవగా సందడి చేస్తోంది. ఈ రోజు (సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం ఉదయం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జల్సా స్పెషల్ షోస్ ప్రదర్శిస్తు్న్నారు.

Jalsa 4k : ట్రెండింగ్‌లో ‘జాతిరత్నాలు’ డైలాగ్..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తాజాగా విడుదలైన చిత్రాలకన్నా .. ఎప్పుడో పద్నాలుగేళ్ళ క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘జల్సా’ (Jalsa) నే ఎక్కువగా సందడి చేస్తోంది. ఈ రోజు (సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం ఉదయం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జల్సా స్పెషల్ షోస్ ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకూ రీరిలీజ్‌లో ఏ సినిమాకు లేనంత స్థాయిలో అత్యధిక షోస్ నడుస్తున్నాయి. గత నెల్లో మహేశ్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు నాడు ‘పోకిరి’ (Pokiri) రీరిలీజ్ స్పెషల్ షోస్ భారీ స్థాయిలో ప్లాన్ చేయగా.. అంతకు మించి అంటూ.. ‘జల్సా’ షోస్ భారీ స్థాయిలో ప్రదర్శిస్తున్నారు. వాటికి వస్తున్న రెస్పాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంది. హైదరాబాద్ సహా అన్ని మేజర్ సిటీస్ లోనూ భారీ స్పెషల్ షోస్ హౌస్ ఫుల్స్ తో రన్ అవుతున్నాయి. 


అదే సమయంలో గతేడాది బ్లాక్ బస్టర్ అయిన కామెడీ మూవీ ‘జాతిరత్నాలు’ (Jathiratnalu) లోని ఒక డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ..నవీన్ పోలిశెట్టి (Navin Polisetty) ని ఉద్దేశించి.. ‘నువ్వు మాకోసం ఏం చేశావ్ రా’ అని అడుగుతారు. దానికి నవీన్ బదులిస్తూ.. ‘ఏం చేయలేదురా మీకోసం నేను.. 2008, మార్చ్ 27 నటరాజ్ థియేటర్, సంగారెడ్డి.. ‘జల్సా’ సినిమా రిలీజ్ ఆరోజు. నేను బాల్కానీ లో ఉన్నా. మీరు కింద రూ. 10ల టికెట్లో ఉన్నారు. పైకి తీస్కరాలేదారా ఆరోజు మిమ్మల్ని.. నా నేచర్ రా అది’ అని అంటాడు. ఇప్పుడు పద్నాలుగేళ్ళ తర్వాత ఓ రెగ్యులర్ స్టార్ హీరో సినిమా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో ‘జల్సా’ సందడి చేస్తుండడంతో నవీన్ జాతిరత్నాలు సినిమాలో ఈ డైలాగ్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. అమెజాన్ వాళ్ళు సైతం ఈ డైలాగ్ ను కోట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. పవర్ స్టార్ రేంజ్ ఇది అని అభిమానులు ఈ పోస్టుల్ని వైరల్ చేస్తున్నారు.  



Updated Date - 2022-09-02T15:10:13+05:30 IST