ఇల్లు లేదు... ఇల్లాలు లేదు... వ్యాన్‌లోనే కాలం వెళ్లదీస్తోన్న HOLLYWOOD స్టార్ హీరో!

ABN , First Publish Date - 2022-01-30T03:50:25+05:30 IST

తన ఇద్దరు పిల్లలు నివాసముంటోన్న ఇంటికి దగ్గరగా... మిత్రుడి ఇంటి ముందు ఖాళీ స్థలంలో... ఖరీదైన వ్యాన్‌లో కాలం వెళ్లదీస్తున్నాడు హాలీవుడ్ సూపర్ స్టార్! వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం!

ఇల్లు లేదు... ఇల్లాలు లేదు... వ్యాన్‌లోనే కాలం వెళ్లదీస్తోన్న HOLLYWOOD స్టార్ హీరో!

తన ఇద్దరు పిల్లలు నివాసముంటోన్న ఇంటికి దగ్గరగా... మిత్రుడి ఇంటి ముందు ఖాళీ స్థలంలో... ఖరీదైన వ్యాన్‌లో కాలం వెళ్లదీస్తున్నాడు హాలీవుడ్ సూపర్ స్టార్! వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! 


జాసన్ మొమోవా 7,50,000 డాలర్లు ఖరీదు చేసే... (అంటే, మన లెక్కల్లో 5 కోట్ల పైమాటే...) ‘ఫోర్డ్ ఆర్వీ’ లగ్జరీ వ్యాన్‌లో కొద్ది రోజులుగా ఉంటున్నాడట. అదీ ఓ మిత్రుడి ఇంటి ముంగిట్లో తన వాహనాన్ని పార్క్ చేసుకుని రోజులు వెళ్లదీస్తున్నాడు. అతడికి ఈ స్థితి రావటానికి కారణం అనూహ్యంగా వెలువడిన విడాకుల వార్తలే. 17 ఏళ్లుగా జాసన్ మొమోవా తన భార్య లీసా బోనెట్‌తో బంధం కొనసాగిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఇంత కాలానికి హాలీవుడ్ స్టార్ కపుల్ మధ్య ఏం జరిగిందో ఏమోగానీ తాము విడిపోతున్నట్టు ప్రకటించేశారు. ‘మరి వాట్ నెక్ట్స్’ అనుకున్న జాసన్ ప్రస్తుతానికి తన క్యారవాన్‌ వాన్‌లోనే టైంపాస్ చేస్తున్నాడు. ఆయన తాజా ఫోటోలు కూడా మీడియా చేతికి చిక్కటంతో ఇప్పుడు హాలీవుడ్‌లో మొమోవా హాట్ టాపిక్‌గా మారాడు. 


జాసన్ మొమోవా ‘ఆక్వామాన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాంటి సినిమాలు, షోస్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాడు. చాలా ఏళ్ల డేటింగ్ తరువాత అతను లీసాని పెళ్లాడాడు. వివాహం తరువాత కూడా బలంగా కొనసాగిన వారి రిలేషన్ 17 ఏళ్లకు విడాకులతో ముగిసింది. కనీసం హోటల్ రూముకి కూడా షఫ్ట్ కాకుండా ఇంటికి, పిల్లలకి దగ్గర్లోనే రోజులు గడుపుతోన్న హాలీవుడ్ స్టార్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటో మరి... 

Updated Date - 2022-01-30T03:50:25+05:30 IST