Aishwarya Rai: చీరతో జపాన్ యువతి బాలీవుడ్ డైలాగ్

ABN , First Publish Date - 2022-07-24T23:52:33+05:30 IST

ఎవరైనా భారతీయ కళలు, సినిమాలను పొగిడితే అది అద్భుతంగా ఉంటుంది. భారత్‌కు చెందినవారు ఇతర దేశాలకు చెందిన వారు అయితే అది మరింత కిక్‌ను ఇస్తుంది. తాజాగా జపాన్‌కు చెందిన యువతి చీరను

Aishwarya Rai: చీరతో జపాన్ యువతి బాలీవుడ్ డైలాగ్

ఎవరైనా భారతీయ కళలు, సినిమాలను పొగిడితే అది అద్భుతంగా ఉంటుంది. భారత్‌కు చెందినవారు ఇతర దేశాలకు చెందిన వారు అయితే అది మరింత కిక్‌ను ఇస్తుంది. తాజాగా జపాన్‌కు చెందిన యువతి చీరను ధరించి బాలీవుడ్ డైలాగ్‌ను చెప్పింది. దీంతో ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్స్ అందరు లైక్స్‌తో తమ సంతోషాన్ని తెలుపుతున్నారు. 


మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా ‘గురు’ (GURU). అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) హీరో, హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ చెప్పిన ఐకానిక్ డైలాగ్‌ను జపాన్‌కు చెందిన ఓ యువతి చీరతో పలికింది. మయో జపాన్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అభిమానులందరూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘మీరు చీరలో అద్భుతంగా కనిపిస్తున్నారు’’ అని ఓ నెటిజన్ కామెంట్  చేశాడు. ‘‘జపనీస్ ఐశ్వర్యరాయ్’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ స్పందించాడు. ఈ వీడియో జులై 14న అప్‌లోడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2.54లక్షల లైక్స్ వచ్చాయి. ఈ యువతికి హిందీలో డిగ్రీ ఉన్నట్టు తెలుస్తోంది. ‘గురు’ లో మాధవన్, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. భారీ స్థాయిలో కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ధీరుబాయ్ అంబానీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 



Updated Date - 2022-07-24T23:52:33+05:30 IST