Good Luck Jerry: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న Janhvi Kapoor సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2022-06-18T02:09:17+05:30 IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల సుందరి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry)సినిమాలో

Good Luck Jerry: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న Janhvi Kapoor సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry)సినిమాలో నటించింది. సిద్దార్థ్ సేన్‌గుప్తా (Sidharth Sengupta) దర్శకత్వం వహించాడు. సుబాస్కరన్, ఆనంద్ ఎల్.రాయ్ (Aanand L. Rai) సంయుక్తంగా నిర్మించారు. దీపక్ దోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.‘గుడ్ లక్ జెర్రీ’ ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.  


ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్‌లో ‘‘గుడ్ లక్ జెర్రీ’’ జులై 29నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపింది. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్స్‌ను కూడా నెటిజన్స్‌తో ఆమె పంచుకుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ కు రీమేకే ‘గుడ్ లక్ జెర్రీ’. జాన్వీ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడం ఇది రెండోసారి. గతంలో ఆమె నటించిన ‘గుంజన్ సక్సేనా: కార్గిల్ గాళ్’ (Gunjan Saxena: The Kargil Girl) చిత్రం 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. 



Updated Date - 2022-06-18T02:09:17+05:30 IST