North vs South debate: సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమంటున్న జాన్వీ కపూర్.. అదేంటో అర్థం కాదంటూ..

ABN , First Publish Date - 2022-07-27T17:14:07+05:30 IST

అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్. తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని..

North vs South debate: సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమంటున్న జాన్వీ కపూర్.. అదేంటో అర్థం కాదంటూ..

అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని అందిపుచ్చుకున్న ఈ భామ మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అనంతరం కూడా వరుసగా కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘గుడ్‌లక్ జెర్రీ (GoodLuck jerry)’. నయనతార లీడ్‌రోల్‌లో నటించి సూపర్ హిట్ కోలీవుడ్ చిత్రం ‘కోలమావు కోకిల (కో కో కోకిల)’కి ఇది అధికారిక రిమేక్. త్వరలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్ని ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ (south) సినిమాల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. 


జాన్వీ మాట్లాడుతూ.. ‘నాకు సౌత్ సినిమాని చేయాలని ఉంది. అక్కడి దర్శకులు, నటులు, టెక్నిషియన్లతో పని చేయాలని ఉంది. వారు తమ పనిలో అగ్రస్థానంలో ఉన్నారని నేను భావిస్తున్నాను. దక్షిణాది వర్కింగ్ స్టైల్‌కి, సంగీతానికి అభిమానిని. నేను సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.


సౌత్ వర్సెస్ నార్త్ సినిమా చర్చ గురించి మాట్లాడుతూ.. ‘నాకు ఈ చర్చ ఎందుకో అర్థం కాదు. ఇది మన దేశం. చాలా మంది జనాలు ఇతర ప్రాంతాల సినిమాలను కూడా చూస్తున్నారు. అందెంతో మంచి విషయం. అందుకే అనవసరం అని నా అభిప్రాయం’ అని తెలిపింది. కాగా.. జాన్వీ ప్రస్తుతం ఈ మూవీతో పాటు రాజ్‌కుమార్ రావ్ హీరోగా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ అనే సినిమాని చేస్తోంది. అలాగే.. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ జాన్వీ చేతిలో ఉన్నాయి.

Updated Date - 2022-07-27T17:14:07+05:30 IST