Janhvi Kapoor: అది కళాత్మక స్వేచ్ఛ.. రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ పిక్స్‌పై స్పందించిన బ్యూటీ

ABN , First Publish Date - 2022-07-30T15:28:18+05:30 IST

మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం రణవీర్‌సింగ్ (Ranveer Singh) నగ్నంగా ఫొటోలకి ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే..

Janhvi Kapoor: అది కళాత్మక స్వేచ్ఛ.. రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ పిక్స్‌పై స్పందించిన బ్యూటీ

మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం రణవీర్‌సింగ్ (Ranveer Singh) నగ్నంగా ఫొటోలకి ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే. అవి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా.. చెంబూరు పోలీస్ స్టేషన్‌లో రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నటుడు తన నగ్న ఫోటోలతో మహిళల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ ఎన్జీవో ఆఫీస్ బేరర్ ఫిర్యాదు చేశారు. అయితే.. కొందరు నెటిజన్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్‌వీర్ సింగ్‌కి సపోర్టుగా సైతం నిలిచారు. అలియా భట్, విద్యాబాలన్ వంటి ప్రముఖులు ఇప్పటికే మద్దతు తెలుపగా.. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ, అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సైతం రణ్‌వీర్‌కి తన మద్దతు తెలిపారు.


ఢిల్లీలో రిలయన్స్ డిజిటల్ షోరూమ్‌ని జాన్వీ తాజాగా ప్రారంభించింది. ఈ సందర్భంగా కొందరు విలేకరులు రణ్‌వీర్ న్యూడ్ పిక్స్ గురించి జాన్వీ అభిప్రాయం అడిగారు. దానికి జాన్వీ స్పందిస్తూ.. ‘అది కళాత్మక స్వేచ్ఛ అని నేను భావిస్తున్నాను. అలాంటి దాని కోసం ఎవరినైనా విమర్శించడం, విశ్లేషించడం సరైన పద్ధతి కాదని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది. దీనిపై సైతం పలువురు నెటిజన్లు స్పందిస్తూ కొందరు ఈ బ్యూటీ సరైనవేనంటూ.. మరికొందరూ కరెక్టు కాదంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.


జాన్వీ నటించిన తాజా చిత్రం ‘గుడ్‌లక్ జెర్రీ(Goodluck jerry)’ జులై 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘కొలమావు కోకిల (తెలుగులో కో కో కోకిల)’కి ఇది రిమేక్‌గా తెరకెక్కింది. నయన్ మూవీలాగే జాన్వీ చిత్రం సైతం మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. కాగా.. ఈ బ్యూటీ ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో నటిస్తోంది.

Updated Date - 2022-07-30T15:28:18+05:30 IST