జమ్మూ కశ్మీర్‌లో మొదటి national film festival .. ఎప్పుడు మొదలు కాబోతుందంటే..

ABN , First Publish Date - 2022-05-17T01:12:52+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో మొదటి నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ జూన్ 15న మొదలు కాబోతుంది. వివిధ కేటగిరీల కింద ఈ ఫెస్టివల్‌లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు

జమ్మూ కశ్మీర్‌లో మొదటి national film festival .. ఎప్పుడు మొదలు కాబోతుందంటే..

జమ్మూ కశ్మీర్‌లో మొదటి నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ జూన్ 15న మొదలు కాబోతుంది. వివిధ కేటగిరీల కింద ఈ ఫెస్టివల్‌లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడానికీ ఎంట్రీలకు చివరి తేదీ మే 16గా నిర్వహకులు తెలిపారు. ఇండియన్ ఫిలిం మేకర్స్, ఆర్టిస్ట్స్ అందరు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని వారు కోరారు.  


ఈ ఫిలిం ఫెస్టివల్‌లో ఫీచర్ ఫిలింస్, నాన్ ఫీచర్ ఫిలింస్, మ్యూజిక్ వీడియోస్ వంటి కేటగీరీల్లో అవార్డులను అందజేయనున్నారు. ఒరిజినల్ ఫిలింస్ ఫిక్షన్, డాక్యుమెంటరీ, ఓటీటీ లేదా షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ వీడియోస్ వంటి విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో 40కి పైగా అవార్డులను ఇవ్వనున్నారు. విజేతలకు నగదు బాహుమతి, సర్టిఫికేట్‌తో పాటు ఓ మెడల్‌ను అందజేయనున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనాలనుకుంటే నియమ, నిబంధనల కోసం https://filmfreeway.com/nffjk వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ఎంట్రీలను https://filmfreeway.com/nffjk వెబ్‌సైట్ ద్వారా పంపవచ్చు. నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (National Film Development Corporation) తో కలసి జమ్మూ అండ్ కశ్మీర్ ఫిలిం డెవలప్‌మెంట్ కౌన్సిల్  (J&K Film Development Council) ఈ ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహిస్తుంది. శ్రీనగర్‌లో ఈ ఉత్సవం జూన్ 15 నుంచి 20 మధ్య జరగనుంది. ఇండియన్ టాలెంట్‌ను వెలికి తీయడానికే ఈ ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నామని నిర్వహకులు తెలిపారు. టాలెంట్‌కు తగిన అవకాశాలను కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Updated Date - 2022-05-17T01:12:52+05:30 IST