Avatar The Way of Water: 13 ఏళ్ల నిరీక్షణకి తెర.. అదిరిపోయే విజువల్స్‌తో ‘అవతార్ 2’ టీజర్ ట్రైలర్

ABN , First Publish Date - 2022-05-10T17:14:12+05:30 IST

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అవతార్’. 2009లో విడుదలైన ఈ చిత్రం ఎటువంటి ప్రభజనం సృష్టించిందో..

Avatar The Way of Water: 13 ఏళ్ల నిరీక్షణకి తెర.. అదిరిపోయే విజువల్స్‌తో ‘అవతార్ 2’ టీజర్ ట్రైలర్

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించిన చిత్రం ‘అవతార్’. 2009లో విడుదలైన ఈ చిత్రం ఎటువంటి ప్రభజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ మూవీ వేల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులని బద్దలు కొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కామెరూన్ ప్రకటించాడు. 


అప్పటి నుంచి ఆ దర్శకుడు మరెన్నీ వండర్స్ చూపిస్తాడోనని ‘అవతార్’ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకి తాజాగా తెరపడింది. ఆ సినిమా సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ టీజర్ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఆ ట్రైలర్ చూస్తే కామెరూన్ మరోసారి విజువల్స్‌తో మ్యాజిక్ చేయనున్నాడని అర్థమవుతోంది. అందులో మొదటి పార్ట్ క్యారెక్టర్స్‌ని కొనసాగిస్తూ జేక్ సల్లీగా సామ్ వర్తింగ్టన్, నేటిరిగా జో సల్దానా కనిపించనున్నారు. అంతేకాకుండా మొదటి భాగం ఆకాశంలో జరిగితే.. ఈ పార్ట్‌లో ఎక్కువ భాగం సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే నీటి మీద జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే విజువల్స్ కూడా మొదటి పార్ట్‌ని మించి ఉంటాయని అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 16న థియేటర్స్ విడుదలకానుంది. ‘అవతార్ 2’ వండర్‌ఫుల్ టీజర్ ట్రైలర్‌ని మీరు ఓసారి చూసేయండి..



Updated Date - 2022-05-10T17:14:12+05:30 IST