Karthikeya 2: ఆ థియేటర్లో ‘కార్తికేయ 2’ చిత్రానికి చిన్న బ్రేక్!

ABN , First Publish Date - 2022-08-30T02:58:01+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలై రెండు వారాలకు పైగా అవుతున్నా..

Karthikeya 2: ఆ థియేటర్లో ‘కార్తికేయ 2’ చిత్రానికి చిన్న బ్రేక్!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలై రెండు వారాలకు పైగా అవుతున్నా.. ఇంకా ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. ఈ అనూహ్య విజయానికి చిత్రయూనిట్ కూడా చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్‌ని ప్రేక్షకులతో పంచుకునేందుకు టూర్స్ అంటూ.. హీరో అండ్ టీమ్ థియేటర్లను విజిట్ చేస్తున్నారు. మరి ఇంత చక్కగా థియేటర్లలో రన్ అవుతున్న చిత్రానికి బ్రేక్ అంటే.. డౌటనుమానాలు సహజమే. విషయంలోకి వస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) కోసం.. హైదరాబాద్‌ ఆర్‌టిసి క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ‘కార్తికేయ 2’ చిత్రానికి చిన్న బ్రేక్ వేయబోతున్నారు.


పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆయన నటించిన ‘జల్సా’ (Jalsa), ‘తమ్ముడు’ (Thammudu) చిత్రాల ప్రత్యేక షోలను అభిమానులు ప్రదర్శించబోతున్నారు. అంతకుముందు సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) పుట్టినరోజున ‘పోకిరి’ (Pokiri) చిత్రాన్ని కూడా మహేష్ అభిమానులు ఇలాగే ప్రదర్శించి.. తద్వారా వచ్చిన మొత్తాన్ని ఛారిటీకి వినియోగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు కూడా సేమ్ టు సేమ్ అదే చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ ప్రత్యేక షోల విషయంలో కూడా పవన్ కల్యాణ్ అభిమానులు రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. సరే ఆ విషయం పక్కన పెడితే.. 


దేవి 70MM థియేటర్‌లో రన్ అవుతోన్న ‘కార్తికేయ 2’ని సెప్టెంబర్ 1వ తేదీన ‘జల్సా’ ప్రత్యేక షోతో రీప్లేస్ చేయబోతున్నారని తెలిసింది. ప్రత్యేక షోల అనంతరం మళ్లీ ‘కార్తికేయ 2’ చిత్రం నార్మల్‌గా ఈ థియేటర్‌లో రన్ కానుంది. దీని కోసం ఇప్పటికే ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ఆ థియేటర్లలో ప్రదర్శిస్తున్న వారి దగ్గర నుండి అనుమతులు కూడా పవన్ అభిమానులు తీసుకున్నట్లుగా సమాచారం. 

Updated Date - 2022-08-30T02:58:01+05:30 IST