Pawan kalyan: సంజయ్‌ సాహు అరైవింగ్‌!

ABN , First Publish Date - 2022-08-13T00:00:40+05:30 IST

ఫిల్మ్‌ రూపంలో విడుదలైన ట్రెండ్‌సెట్టర్‌ సినిమాలను ఇప్పటి టెక్నాలజీలో డిజిటలైజ్‌ చేసి కొత్త హంగులతో విడుదల చేయడం ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు ఫిల్మ్‌తో స్ర్కీన్‌పై సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4కె వెర్షన్‌లో, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌కి కన్వర్ట్‌ చేసి థియేటర్‌లలో రీ రిలీజ్‌ చేస్తున్నారు.

Pawan kalyan: సంజయ్‌ సాహు అరైవింగ్‌!

ఫిల్మ్‌ రూపంలో విడుదలైన ట్రెండ్‌సెట్టర్‌ సినిమాలను ఇప్పటి టెక్నాలజీలో డిజిటలైజ్‌ చేసి కొత్త హంగులతో విడుదల చేయడం ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు ఫిల్మ్‌తో స్ర్కీన్‌పై సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4కె వెర్షన్‌లో, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌కి కన్వర్ట్‌ చేసి థియేటర్‌లలో రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 9న మహేశ్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళలో ‘పోకిరి’, ఒక్కడడు చిత్రాలను విడుదల చేయగా హౌస్‌ఫుల్స్‌తో అభిమానులు హంగామా చేశారు. సుమారు రెండు కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ వంతు వచ్చింది. అదే హంగామాను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమానులు చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘జల్సా’ చిత్రం సెప్టెంబర్‌ 2న పవన్‌ బర్త్‌డే సందర్భంగా థియేటర్‌లలో సందడి చేయనుందని రెండ్రోజులుగా నెట్టింట వార్తలు హల్‌ చేస్తున్నాయి. 14 ఏళ్ల క్రితం విడుదలై సక్సెస్‌ సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు డిజటలైజ్‌ చేసి 4కె రిజల్యూషన్‌లో విడుదల చేసే సన్నాహాల్లో నిర్మాత అల్లు అరవింద్‌ ఉన్నారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. కానీ గీత ఆర్ట్స్‌ పేరుతో ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్లు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే నెల 2న ఈ చిత్రం 4కె వెర్షన్‌లో విడుదల ఉందా లేదా అన్న మీమాంశ కూడా ఉంది. 


ఈ తరుణంలో గీతా ఆర్ట్స్‌కు సన్నిహితుడు, దర్శకనిర్మాత సాయిరాజేశ్‌ నీలం కొంత క్లారిటీ ఇచ్చారు. ‘సంజయ్‌ సాహు అరైవింగ్‌ అంటూ ట్వీట్‌ చేయడంతో అభిమానులతో నూతన ఉత్సాహం మొదలైంది. ‘‘క్యూబ్‌లో ‘జల్సా’ సినిమా చూశా. బాబు కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతున్నాడు. కొత్త ప్రింట్‌, సౌండ్‌ సిస్టం అమేజింగ్‌. షోలు, పబ్లిసిటీ అంతా సీనియర్స్‌ ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో జరుగుతాయి. సంజయ్‌ సాహు అరైవింగ్‌’. సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టుకోవచ్చు’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. అయితే దీని గురించి గీత ఆర్ట్స్‌, అనుబంధ సంస్థ అయిన జీఎ2 పిక్చర్స్‌ ఏ వేదికలోనూ దీని గురించి వెల్లడించలేదు. 


సంజయ్‌ సాహు పాత్రలో పవన్‌కల్యాణ్‌ చెప్పిన సంభాషణలివి.


‘‘ఖరీదైన బైకుల్లో తిరుగుతూ ఏసీలో రూముల్లో ఉంటూ... రోజుకి వెయ్యి రూపాయిలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు..(Pawan kalyan)


స్కూల్‌కి వెళ్లాలంటే పోను 4 కిలోమీటర్లు, రాను 4 కిలోమీటల్లు నడవాలని నీకు తెలుసా? నాకు తెలుసు...


అన్నం అంటే జొన్న అన్నం తినాలని, వరి అన్నం ఆరు నెలలకే వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండగ అని నీకు తెలిసా... నాకు తెలుసు. 


ఆకలేస్తే నేల వైపు,. దాహం వేస్తే ఆకాశం వైపు చూసే జనాలు ఈ సమాజంలో ఉన్నారని... నువ్వు ఉన్న ఈ సమాజంలో ఉన్నారని నీకు తెలుసా? నాకు తెలుసు..


తండ్రి చనిపోయిన ఆరు గంటలకే తల్లి చనిపోతే.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు.. ఆ బాధ అనుభవించావా? నేను అనుభవించాను. 


కంటికి కనిపించని ఏదో శక్తి టన్నుల బరువుతో కిందికి తొక్కుతున్నట్లు నీకు ఎప్పుడన్నా అనిపించిందా? 

అడవి  ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? 

తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటుందని అనిపించిందా? 

నాకు అనిపించింది.. అందుకే తుపాకీ పట్టి అడవిలోకి వెళ్లాను.. నక్సలైట్‌ను అయ్యాను’’ 








Updated Date - 2022-08-13T00:00:40+05:30 IST