Jailer: త్వరలో క్రేజీ అప్‌డేట్..!

ABN , First Publish Date - 2022-07-24T16:11:30+05:30 IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelsaon Dilip Kumar) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రజినీ - నెల్సన్ ల కాంబినేషన్‌లో

Jailer: త్వరలో క్రేజీ అప్‌డేట్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelsaon Dilip Kumar) ఓ సినిమా చేస్తున్న సంగతి  తెలిసిందే. రజినీ - నెల్సన్ ల కాంబినేషన్‌లో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 'జైలర్' అని మాస్ టైటిల్ ని ఫిక్స్ చేశాక అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. కాగా, భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ క్రేజీ అప్డేట్ ఒకటి కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. 


'జైలర్' సినిమా నుంచి మేకర్స్ అతి త్వరలోనే ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయాలని ప్లాన్ చూస్తున్నారట. 'తలైవర్' ఫ్యాన్స్ దీనికోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ క్రేజీ టీజర్ పై మరింత క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 


రజినీకి హిట్ పడి చాలాకాలం అయింది. కబాలి సినిమా నుంచి ఏ సినిమా చేసినా వరుసగా ఫ్లాపే అవుతోంది. గత చిత్రం 'అణ్ణాత్త' కూడా మాస్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ మూవీ బాకాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్ సాధించాలని పట్టుదలతో ఛాన్స్ నెల్సన్ దిలీప్ కుమార్‌కి ఇచ్చారు సూపర్ స్టార్. మరి ఈ అవకాశాన్ని ఎంతవరకూ నెల్సన్ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.  

Updated Date - 2022-07-24T16:11:30+05:30 IST