Jai LavaKusa: ఇప్పుడు స్పెషల్ షోస్ ఎందుకు..?

ABN , First Publish Date - 2022-09-02T21:11:49+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బర్త్ డే స్పెషల్ గా ఫాన్స్ పోకిరి (Pokiri)ని ధియేటర్స్‌లో ఎంజాయ్ చేశారు. ఈ ఫాన్స్ షోకి పీక్ స్టేజ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Jai LavaKusa: ఇప్పుడు స్పెషల్ షోస్ ఎందుకు..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బర్త్ డే స్పెషల్ గా ఫాన్స్ పోకిరి (Pokiri)ని ధియేటర్స్‌లో ఎంజాయ్ చేశారు. ఈ ఫాన్స్ షోకి పీక్ స్టేజ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఫాన్స్ జల్సా (Jalsa) సినిమాని గ్రాండ్ స్కేల్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పోకిరి, జల్సా సినిమాలు అంటే ఆ హీరోల పుట్టిన రోజు కాబట్టి స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. కానీ ఎన్టీఆర్ (NTR) ఫాన్స్ మాత్రం... జై లవకుశ (Jai LavaKusa) సినిమా స్పెషల్ షోతో ధియేటర్ టాప్ లేపారు. విజయవాడలోని అన్నపూర్ణ ధియేటర్‌లో... జై లవకుశ సినిమా ప్రిమియర్‌ను ప్రదర్శించారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ తన నటవిశ్వరూపాన్నే చూపించాడు. 


ముఖ్యంగా స్టామరింగ్ ఉన్న రావన్ పాత్రలో తారక్ అద్భుతాన్నే సృష్టించాడు. ఆ పాత్రలో తారక్ చేసిన పెర్ఫార్మెన్స్ టేర్రిఫిక్‌గా ఉంటుంది. అందుకే, ఈ మూవీని తారక్ ఫాన్స్ స్పెషల్‌గా ట్రీట్ చేస్తారు. ఫాన్స్ స్పెషల్ షోలో రావన్ ఇంట్రడక్షన్ సీన్ టైంలో.. ఎన్టీఆర్ అభిమానులు చేసిన రచ్చ చూస్తే, ఇదెక్కడి సెలబ్రేషన్ రా బాబు అనిపించకమానదు. అసలు ఇంతకీ జైలవ కుశ సినిమాని స్పెషల్ షో ఎందుకు వేశారు..? అని చాలా మంది డౌట్‌లో ఉన్నారు. 


ఈ మూవీ రిలీజై అయిదు సంవత్సరాలు అవుతోంది, పైగా సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టిన రోజు. ఈ రెండు అకేషన్స్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి నందమూరి ఫాన్స్, జై లవకుశ సినిమాని ధియేటర్‌లో ఎంజాయ్ చేశారు. సెప్టెంబర్ 21కి జై లవకుశ సినిమా రిలీజై 5 ఏళ్ళు అవుతుంది. కాబట్టి... ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రావన్ అరాచకం మరోసారి చూసే ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

Updated Date - 2022-09-02T21:11:49+05:30 IST