Pushpa Mania: ‘తగ్గేదే లే’ అంటున్న హనుమాన్ జయంతి అల్లర్ల నిందితుడు.. వైరల్ అవుతున్న వీడియో

ABN , First Publish Date - 2022-04-18T15:10:40+05:30 IST

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’..

Pushpa Mania: ‘తగ్గేదే లే’ అంటున్న హనుమాన్ జయంతి అల్లర్ల నిందితుడు.. వైరల్ అవుతున్న వీడియో

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’. గతేడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అందులో హీరో పాత్ర చేసే ‘తగ్గేదే లే’ ఫోజు బాగా పాపులర్ అయింది. దీంతో ఎంతోమంది ఆ ఫోజుని ఫాలో అవుతున్నారు. తాజాగా హనుమాన్ జయంతి రోజు జహంగీర్‌పురిలో జరిగిన అల్లర్లలో నిందితుడు సైతం ఈ పుష్ప సిగ్నేచర్ మూవ్‌ని  కెమెరాకి చేసి చూపించాడు.


హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జహంగీర్‌పురిలో అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో కొందరు వ్యక్తులు బహిరంగంగా కాల్పులు జరిపారు. కెమెరా విజువల్స్ ఆధారంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రధాన నిందితుడైన అన్సార్ కోర్టుకు వెళుతుండగా.. కెమెరాలకు ‘తగ్గేదే లే’ అంటూ గడ్డాన్ని చేతితో రుద్దుతూ చూపించాడు. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో ‘పుష్ప’ మ్యానియా గురించి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అన్సార్‌పై ఐపీసీ సెక్టన్లు 147, 148, 353,332, 323, 427, 307, 120బీ కింద కేసులు నమోదయ్యాయి.





Updated Date - 2022-04-18T15:10:40+05:30 IST