బాలీవుడ్‌ చిత్రంలో జగ్గూభాయ్‌

ABN , First Publish Date - 2022-12-10T06:25:53+05:30 IST

జగపతిబాబు కెరీర్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఆయనకు అన్ని భాషల నుంచీ అవకాశాలు అందుతున్నాయి.

బాలీవుడ్‌ చిత్రంలో జగ్గూభాయ్‌

జగపతిబాబు కెరీర్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఆయనకు అన్ని భాషల నుంచీ అవకాశాలు అందుతున్నాయి. తాజాగా ఆయన ఖాతాలో ఓ బాలీవుడ్‌ సినిమా కూడా చేరిపోయింది. ఆయుష్‌ శర్మ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సుశ్రీ మిశ్రా కథానాయిక. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. కాత్యాయన్‌ శివపురి దర్శకుడు. ఈ చిత్రంలో జగపతిబాబుని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకొన్నారు. ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. 

Updated Date - 2022-12-10T06:25:53+05:30 IST