Jacqueline Fernandez to Nora Fatehi: మోసగాడు సుకేశ్ నుంచి విలువైన బహుమతులు అందుకున్న బాలీవుడ్ భామలు వీరే..

ABN , First Publish Date - 2022-09-16T19:10:57+05:30 IST

సుకేశ్ చంద్రశేఖర్ అనే మోసగాడు కేసు ఇప్పుడు బాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. జైల్లోంచే బెదిరింపు రాకెట్‌ నడపడం..

Jacqueline Fernandez to Nora Fatehi: మోసగాడు సుకేశ్ నుంచి విలువైన బహుమతులు అందుకున్న బాలీవుడ్ భామలు వీరే..

సుకేశ్ చంద్రశేఖర్ అనే మోసగాడు కేసు ఇప్పుడు బాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. జైల్లోంచే బెదిరింపు రాకెట్‌ నడపడం.. అలా చేయనిచ్చినందుకు, తనకు సర్వసౌకర్యాలూ కల్పించినందుకు తిహార్‌ జైలు అధికారులకు నెలకు కోటి రూపాయల దాకా లంచంగా ఇవ్వడం.. నచ్చిన బాలీవుడ్‌ హీరోయిన్‌కల్లా రూ.లక్షలు, కోట్లు విలువ చేసే ఖరీదైన కానుకలు పంపడం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేటుగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ జీవనశైలి ఇది. అతను ప్రస్తుతం రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో శిక్ష అనుభవిస్తుండగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కి కోట్ల రూపాయలు బహుమతిగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆ మోసగాడి నుంచి విలువైన బహుమతులు అందుకున్న బాలీవుడ్ నటీమణుల గురించి తెలుసుకుందాం..


జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fenandez)

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోసం ముంబైలోని జుహులో ఒకటి, శ్రీలంకలో మరో రెండు ఇళ్లు కొనాలని సుకేష్ చంద్రశేఖర్ ప్లాన్ చేశాడు. ఫెర్నాండెజ్ తల్లిదండ్రుల కోసం బహ్రెయిన్‌లో ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు అతను ఈడీకి చెప్పాడు. అతను ఆమె కోసం ఒక విలాసవంతమైన కారును బహుమతిగా ఇవ్వగా.. దాన్ని తిరిగి అతనికే ఇచ్చినట్లు జాక్వెలిన్ చెప్పింది. కాగా.. అతని నుంచి జాక్వెలిన్ దాదాపు రూ.10 కోట్ల వరకూ లబ్ధి పొందినట్లు ప్రచారం జరుగుతోంది.


నోరా ఫతేహి (Nora Fatehi)

సుకేశ్‌కి సంబంధించిన రూ.200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి నోరా ఫతేహీని ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు ఆమెను ఎంక్వైరీ చేశాను. సుకేష్ చంద్రశేఖర్ తనకు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసేందుకు నోరా విచారణలో ఒప్పుకుంది. ఆ కారు ధర దాదాపు రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా.


నిక్కీ తంబోలి (Nikki Tamboli)

నివేదికల ప్రకారం.. నిక్కీ తంబోలికి పరిచయం చేసినందుకు  పింకీ ఇరానీకి సుకేష్ చంద్రశేఖర్ రూ.10 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో నుంచి రూ.1.5 లక్షలను తంబోలికి ఇచ్చింది. అనంతరం.. మొదటి సారి కలిసిన సందర్భంలో సుకేశ్ ఆమెకు ఖరీదైన గుస్సీ బ్యాగ్‌తోపాటు రూ.2 లక్షలు బహుమతిగా ఇచ్చాడు.


చాహత్ ఖన్నా (Chahat Khanna)

పరిచయమైన మొదట్లోనే చాహత్ ఖన్నాకి సుకేశ్ రూ.2 లక్షలతోపాటు.. ఖరీదైన వెర్సాస్ వాచ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


సోఫియా సింగ్ (Sophia Singh)

సోఫియా సింగ్‌ని కలిసిన తర్వాత సుకేశ్ ఆమె ఖాతాలో రూ.2 లక్షలు జమ చేశాడు. అంతేకాకుండా.. ఆమెకు ఖరీదైన ఎల్‌వీ బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అనంతరం.. మరో సందర్భంలో ఆమెకు రూ.1.5 లక్షలు ఇచ్చిన్నట్లు సమాచారం.

Updated Date - 2022-09-16T19:10:57+05:30 IST