12 ఏళ్లల్లో 9 ఫ్లాప్ సినిమాలు.. అయినా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆస్తి ఎన్ని కోట్లంటే...

ABN , First Publish Date - 2021-12-09T18:41:38+05:30 IST

జాక్విలిన్ ఫెర్నాండెజ్ పేరు ఈ మధ్య జనం నోళ్లలో బాగా నానుతోంది. అందుకు కారణం ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టటమే. 200 కోట్ల భారీ మొత్తాన్ని అక్రమంగా చేబులో వేసుకున్న సుఖేశ్ చంద్రశేఖర్‌తో జాకీ డేటింగ్ చేసిందంటూ పుకార్లు గుప్పుమంటున్నాయి. అందులో నిజం సంగతి ఎలా ఉన్నా నొటోరియ్ క్రిమినల్ సుఖేశ్‌తో జాక్విలిన్ సెల్ఫీ అందర్నీ షాకైతే గురి చేసింది. వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటోన్న ఫోటోలు బాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారాయి.

12 ఏళ్లల్లో 9 ఫ్లాప్ సినిమాలు.. అయినా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆస్తి ఎన్ని కోట్లంటే...

జాక్విలిన్ ఫెర్నాండెజ్ పేరు ఈ మధ్య జనం నోళ్లలో బాగా నానుతోంది. అందుకు కారణం ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టటమే. 200 కోట్ల భారీ మొత్తాన్ని అక్రమంగా చేబులో వేసుకున్న సుఖేశ్ చంద్రశేఖర్‌తో జాకీ డేటింగ్ చేసిందంటూ పుకార్లు గుప్పుమంటున్నాయి. అందులో నిజం సంగతి ఎలా ఉన్నా నొటోరియ్ క్రిమినల్ సుఖేశ్‌తో జాక్విలిన్ సెల్ఫీ అందర్నీ షాకైతే గురి చేసింది. వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటోన్న ఫోటోలు బాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారాయి. 


ఢిల్లీలోని ఓ వ్యాపారి భార్య నుంచీ దాదాపు 200 కోట్లు రాబట్టాడు సుఖేశ్ చంద్రశేఖర్. అది కూడా అతను తీహార్ జైల్లో మరో కేసుకు సంబంధించి శిక్ష అనుభవిస్తుండగా! అటువంటి పేరు మోసిన మోసగాడితో జాక్విలిన్ రొమాన్స్ చేసిందని తెలియటంతో ఈడీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నిస్తున్నారు. దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేశారు. అయితే, సుఖేశ్ చంద్రశేఖర్ కేసు కారణంగా చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న జాక్విలిన్ అతడి నుంచీ దాదాపు 10 కోట్లు విలువ చేసే బహుమతులు కూడా తీసుకుందట! నిజానికి బీ-టౌన్ బ్యూటీ మొత్తం ఆస్తి ఎంతో తెలిస్తే ఎవరైనా అవాక్కైపోతారు... 


జాక్విలిన్ ఫెర్నాండెజ్ 

2009లో ‘అల్లాదిన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చింది. ఆమెది శ్రీలంక. పుట్టింది మాత్రం బహ్రైన్‌లో. చదివింది ఆస్ట్రేలియాలో. ప్రస్తుతం... గత 12 ఏళ్లుగా... జాక్విలిన్ తన దృష్టంతా హిందీ సినిమా రంగం మీదే పెట్టింది. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. సల్మాన్ లాంటి స్టార్ హీరోతో ‘కిక్’ లాంటి సినిమా చేసింది. అయితే, జాక్విలిన్ చేసిన చాలా బాలీవుడ్ మూవీస్ ఫ్లాపుల లిస్టులోనే చేరిపోయాయి. 9 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆమె చేసిన హిట్ చిత్రాలు అతి తక్కువ.


తన ఖాతాలో హిట్ సినిమాలు లేకున్నా జాక్విలిన్ ఫెర్నాండెజ్ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆమె ఆస్తి దాదాపు 74 కోట్లు ఉంటుందట. ముంబైలో స్వంత ఇంటితో పాటూ శ్రీలంక సమీపంలో ఓ దీవి కూడా ఉంది జాకీకి. అంతే కాక ఖరీదైన కార్లు, బంగారం, డైమండ్స్, నగలు వంటివి మరింత విలువ పెంచేస్తాయి. సినిమాల్లో నటించటంతో పాటూ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న శ్రీలంక సుందరి కొలంబో నగరంలో రెస్టారెంట్ కూడా నడుపుతోంది! కోట్లాది రూపాయల జాక్విలిన్ ఆస్తుల్లో 52 లక్షల గుర్రం, 9 లక్షలు విలువ చేసే పిల్లి కూడా ఉన్నాయట! వాట్ని ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారం అవుతోన్న సుఖేశ్ చంద్రశేఖర్ బహుమతిగా ఇచ్చాడని ఈడీ అధికారుల అనుమానం...   

Updated Date - 2021-12-09T18:41:38+05:30 IST