నా సోదరుడి మరణాన్ని మా నాన్న ముందుగానే ఊహించారంటున్న Jackie Shroff

ABN , First Publish Date - 2021-12-26T22:47:01+05:30 IST

సాహోలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటడు జాకీ ష్రాఫ్. ఈ మధ్య ట్వింకిల్ ఖన్నాతో జరిగిన ఒక చర్చలో ఆయన పాల్గొన్నారు

నా సోదరుడి మరణాన్ని మా నాన్న ముందుగానే ఊహించారంటున్న Jackie Shroff

సాహోలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటడు జాకీ ష్రాఫ్. ఈ మధ్య ట్వింకిల్ ఖన్నాతో జరిగిన ఒక చర్చలో ఆయన పాల్గొన్నారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తండ్రి, సోదరుడిని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 


‘‘ నాకు 10ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా సోదరుడు మరణించాడు. మరణించినప్పుడు అతడి వయసు 17 ఏళ్లు. ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందాడు. కానీ, ఇప్పటికి మా మనసులు, ఫొటోల్లో అతడు బతికే ఉన్నాడు. నా సోదరుడు ఒక మిల్లులో పని చేసేవాడు. ఆ రోజు బాగా లేదని మా నాన్న చెప్పారు. అందవల్ల ఇంటిని వదిలి మిల్లుకు వెళ్లొద్దని కోరారు. కానీ, అతడు వినలేదు. సముద్రంలో పడిపోతున్న ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా నా సోదరుడు మరణించాడు ’’ అని జాకీ ష్రాఫ్ చెప్పారు.  


‘‘ అందరు జ్యోతిష్యాన్ని హాస్యంగా భావిస్తారు. కానీ, మా నాన్న 2‌సార్లు కచ్చితంగా జరబోయేది చెప్పారు. తొలిసారిగా నా సోదరుడి మరణం గురించి అంచనా వేశారు. 2వ సారి నేను నటుణ్ని అవుతానన్ని మా నాన్న ముందుగానే ఊహించారు ’’ అని  జాకీ వివరించారు.

Updated Date - 2021-12-26T22:47:01+05:30 IST