గాళ్‌ఫ్రెండ్‌ని గదిలో బంధించి... గన్నుతో కాల్చి... తానూ షూట్ చేసుకున్న సింగర్

ABN , First Publish Date - 2022-01-05T00:22:42+05:30 IST

2022 వస్తూ, వస్తూనే ఆ ముగ్గురు పిల్లల్ని అనాథల్ని చేసేసింది. ఓ సింగర్ ఆవేశపూరిత చర్య వల్ల ఓ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే, అతను కూడా తనని తాను గన్నుతో బలి తీసుకున్నాడు...

గాళ్‌ఫ్రెండ్‌ని గదిలో బంధించి... గన్నుతో కాల్చి... తానూ షూట్ చేసుకున్న సింగర్

2022 వస్తూ, వస్తూనే ఆ ముగ్గురు పిల్లల్ని అనాథల్ని చేసేసింది. ఓ సింగర్ ఆవేశపూరిత చర్య వల్ల ఓ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే, అతను కూడా తనని తాను గన్నుతో బలి తీసుకున్నాడు. చాలా మంది అమెరికన్ పాప్ సంగీత ప్రియులు ర్యాపర్ జే స్టాష్ చేసిన పని వల్ల విషాదంలో మునిగిపోయారు. 


ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన అమెరికన్ సింగర్ స్టాష్ తన ప్రియురాల్ని కొత్త సంవత్సరం రోజునే కాల్చి చంపేశాడు. ఆమెని మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసిన ర్యాపర్ పలుమార్లు కాల్పులు జరిపాడు. తరువాత తనని తాను కూడా గన్నుతో కాల్చుకున్న స్టాష్ అక్కడికక్కడే మరణించాడు. అయితే, అతడి ప్రియురాలికి ముగ్గురు పిల్లలు. 11 ఏళ్ల లోపు వారైనా ఆ పిల్లలు కాల్పుల సమయంలో అదే ఇంట్లో ఉన్నారని న్యూ యార్క్ పొలీసులు చెబుతున్నారు. గన్ను పేలిన శబ్దం వినటంతో వాళ్లు బెడ్ రూమ్ తలుపులు ఎంత బాదినప్పటికీ తెరుచోకకపోవటంతో మొదట తమ అమ్మమ్మకి, తరువాత పోలీసులకి ఫోన్ చేశారట. వారిచ్చిన సమాచారంతోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సింగర్ స్టాష్ బెడ్ రూమ్‌ డోర్స్ బద్ధలుకొట్టి డెడ్ బాడీస్‌ని గుర్తించినట్టు సమాచారం. 


తన ర్యాప్ ద్వారా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న స్టాష్... గాళ్‌ఫ్రెండ్‌ని చంపి, తాను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. అయితే, దారుణానికి ముందు వారిద్దరూ వాదులాడుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవటం గతంలో కంటే ఈ మధ్య మరింత ఎక్కువైంది... 

Updated Date - 2022-01-05T00:22:42+05:30 IST