ఇది అందరికీ కనెక్టయ్యే కథ

ABN , First Publish Date - 2022-05-26T06:47:02+05:30 IST

‘‘బాలీవుడ్‌లో ‘గోల్‌మాల్‌’ ఉన్నట్లు తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరీస్‌ ఉండాలని ‘ఎఫ్‌ 2’ ఫ్రాంఛైజ్‌ ని చేశాం. ‘ఎఫ్‌ 2’లో భార్యాభర్తల ఫ్రస్టేషన్‌ ఉంటే...

ఇది అందరికీ కనెక్టయ్యే కథ

‘‘బాలీవుడ్‌లో ‘గోల్‌మాల్‌’ ఉన్నట్లు తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరీస్‌ ఉండాలని ‘ఎఫ్‌ 2’ ఫ్రాంఛైజ్‌ ని చేశాం. ‘ఎఫ్‌ 2’లో భార్యాభర్తల ఫ్రస్టేషన్‌ ఉంటే ‘ఎఫ్‌ 3’లో మనీ ఫ్రస్టేషన్‌ ఉంటుంది. ఇది అందరికీ కనెక్టయ్యే కథ’’ అని అనిల్‌ రావిపూడి అన్నారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి సినిమా విశేషాలను పంచుకున్నారు. 



‘ఎఫ్‌ 2’కు మించిన వినోదాన్ని ఇందులో చూస్తారు. కచ్చితంగా రిపీట్‌ ఆడియన్స్‌ వస్తారు. ఇది కుటుంబం అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్‌ ధర అందరికీ అందుబాటులో ఉండాలని భావించాం. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టికెట్‌ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్‌ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. 


‘ఎఫ్‌ 2’లో ప్రేక్షకులు బాగా కనెక్టయిన అంశాలతో కొత్త కథను చెప్పాం. ఆ సినిమా సక్సెస్‌ అవడంతో ‘ఎఫ్‌ 3’ కోసం ఆర్టిస్టులందరూ మంచి ఎనర్జీతో పనిచేశారు. సునీల్‌, మురళీశర్మ, అలీ పాత్రలు కొత్తగా వచ్చాయి. 


‘ఎఫ్‌ 2’ విజయంతో అంచనాలు అందుకోవడానికి ‘ఎఫ్‌ 3’లో  ఫన్‌ డోసు పెంచాల్సి వచ్చింది. నత్తి, రేచీకటి ఉన్న పాత్రలతో ఎక్కువ ఫన్‌ చేయవచ్చు అనిపించింది. అందుకే వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ పాత్రలకు ఆ ఎలిమెంట్స్‌ను యడ్‌ చేశాం. అయితే అవి సందర్భానుసారం వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నాం. 


సీన్‌లో ఎలాంటి రియాక్షన్లు ఇవ్వాలనే విషయంలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ మద్య మంచి అవగాహన ఉంది. వరుణ్‌తేజ్‌ కామెడీకి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. వెంకటేష్‌ గారు తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి మరీ కొన్ని సన్నివేశాలు చేశారు. 


ఇందులో మూడో హీరో ఆలోచన వచ్చింది. కానీ అది ట్రంప్‌ కార్డు. ఇప్పుడే వాడకూడదని ఆ ఐడియాను పక్కనపెట్టాం. ‘ఎఫ్‌ 2’ నటీనటులతోనే వీలయినంత ఫన్‌ జనరేట్‌ చేశాం. ‘ఎఫ్‌ 4’లో లేదా తర్వాత కానీ మూడో హీరో పాత్ర పెట్టాలనుకుంటున్నాం.  


ఈ సినిమాలో ఒక్క హీరోయిన్స్‌ మాత్రమే కాదు ప్రతి పాత్రా అత్యాశతోనే ఉంటుంది. డ బ్బు ఎలా త్వరగా సంపాదించాలనే ఆలోచనతో ఉంటారు. డబ్బు గురించి పతాక సన్నివేశాల్లో చెప్పే సందేశం అందరికీ నచ్చుతుంది. 


ముగ్గురు హీరోయిన్ల మీద ఓ పాట తీశాం. దాని తర్వాత వచ్చే సెలబ్రేషన్‌ పాట కొంచెం స్పెషల్‌గా ఉండాలనుకున్నాం. స్టార్‌  హీరోయిన్‌ గెస్ట్‌గా వస్తే బాగుంటుందని పూజా హెగ్డేను తీసుకున్నాం.  తన నిజజీవిత పాత్రలోనే ఆమె కనిపిస్తారు. 


తర్వాత చేయబోయే బాలయ్య గారి సినిమా ఫుల్‌ మాస్‌గా ఉంటుంది. యాక్షన్‌, హీరోయిజం ఓ స్థాయిలో ఉంటాయి.

Updated Date - 2022-05-26T06:47:02+05:30 IST