Itlu Maredumilli Prajaneekam teaser : వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో తెలియడం లేదు..

ABN , First Publish Date - 2022-06-30T18:50:13+05:30 IST

‘మహర్షి (Maharshi), నాంది (Naandi)’ చిత్రాల సక్సెస్ అల్లరి నరేశ్‌ (Allari Naresh) కు మంచి ఊపునిచ్చింది. కొత్త తరహా పాత్రలు చేయాలన్న తపనను పెంచింది. ప్రస్తుతం తన కెరీర్‌కు మంచి పునాది వేసిన కామెడీ పాత్రల్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు నరేశ్.

Itlu Maredumilli Prajaneekam teaser : వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో తెలియడం లేదు..

‘మహర్షి (Maharshi), నాంది (Naandi)’ చిత్రాల సక్సెస్ అల్లరి నరేశ్‌ (Allari Naresh) కు మంచి ఊపునిచ్చింది. కొత్త తరహా పాత్రలు చేయాలన్న తపనను పెంచింది. ప్రస్తుతం తన కెరీర్‌కు మంచి పునాది వేసిన కామెడీ పాత్రల్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు నరేశ్. తాజాగా అల్లరి నరేశ్ నటిస్తున్న మరో వెరైటీ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఈ సినిమాతో రాజ్ మోహన్ (Raj Mohan) అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. హాస్యా మూవీస్ బ్యానర్ పై, జీ స్టూడియోస్ సమర్పణలో రాజేశ్ దండ, ఏఆర్ మోహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రీ టీజర్ ఇటీవల విడుదల కాగా.. నేడు (జూన్ 30) అల్లరి నరేశ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది టీజర్. 


మారేడు మిల్లి అడవుల చుట్టు పక్క గ్రామాల్లోని ప్రజలచేత ఓటు వేయించడానికి .. హీరో ఎలాంటి రిస్క్ చేశాడు అన్నది సినిమా కథాంశం. ఇదివరకు రాజ్‌కుమార్ రావు (Rajkumar Rao) హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘న్యూటన్’ (Neuton), మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘ఉండ’ (Unda) లతో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రానికి పోలిక ఉన్నట్టు టీజర్ ను చూస్తుంటే అర్ధమవుతోంది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఎంతో రిస్క్ తీసుకొని అడవుల్లో షూటింగ్ చేయడం విశేషంగా చెప్పాలి. ఈ సినిమా అల్లరి నరేశ్ కెరీర్ లో మరో మంచి సినిమా అవుతుందని చెప్పుకోవచ్చు. 


‘ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ .. వీళ్ళలో ఒక్కసారి కూడా జీవితంలో ఓటు వేయని వారున్నారు. ఏదో పండగ చందాలకు అడుక్కోడానికి వెళ్ళినట్టు మనం ఈ గంపలేసుకొని ఈ అన్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ని ఓటేయండి బాబూ అని అడుక్కోవడం ఏంటి సార్? సాయం సేత్తే మనసేయ్.. దాడి సేత్తే ఊరుకోం.. మేం మనుసులమే సారూ.. మీకు మనసులైతే సాయం సేయండి.. 90 కిలోమీటర్ల ఫారెస్ట్, 150 కిలో మీటర్ల చుట్టుకొలత. అక్కడికెళితే ఎవ్వరూ  వెనక్కి తిరిగి రాలేరు. మాకు జరగాల్సిన న్యాయం జరగకపోతే ఎవరినీ వదలం. పాతిక కిలోమీటర్ల ఇవతలికి వస్తేనే కానీ, వీళ్ళిలా బతుకుతున్నారని మనకి కూడా తెలియలేదు. వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియడం లేదు మాస్టారూ’ అంటూ వచ్చే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ సినిమా అల్లరోడికి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 



Updated Date - 2022-06-30T18:50:13+05:30 IST