అశ్లీల చిత్రాల నటి హత్య.. ముక్కలుగా నరికి..

ABN , First Publish Date - 2022-04-01T13:47:32+05:30 IST

గత కొన్ని రోజుల క్రితం ఇటలీలోని ఓ గ్రామ రహదారి పక్కడ డస్ట్‌బీన్‌లో ముక్కలుగా చేసిన ఓ యువతి మృతదేహం..

అశ్లీల చిత్రాల నటి హత్య.. ముక్కలుగా నరికి..

గత కొన్ని రోజుల క్రితం ఇటలీలోని ఓ గ్రామ రహదారి పక్కడ డస్ట్‌బీన్‌లో ముక్కలుగా చేసిన ఓ యువతి మృతదేహం లభించింది. పోలీసుల విచారణలో ఆ యువతి అక్కడ అడల్ట్ చిత్రాలతో పాపులారిటీ సాధించిన నటి షార్లెట్ ఏంజీ‌గా గుర్తించారు. ఈ హత్య కేసులో ఓ బ్యాంకర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. 


పోలీసుల నివేదిక ప్రకారం.. డేవిడ్ ఫోంటానా అనే 43 ఏళ్ల ప్రొఫెషనల్ బ్యాంకర్, ఫుడ్ బ్లాగర్‌గా పని చేస్తున్నారు. అతను 26 ఏళ్ల అడల్ట్ చిత్రాల నటి షార్లెట్‌ని జనవరిలోనే సుత్తికొట్టి హత్య చేశాడు. అప్పటి నుంచి శవాన్ని తన ఇంటిలోనే ఉన్న ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఇటీవలే ఆ శవాన్ని ముక్కలుగా నరికి ఓ గ్రామ సమీపంలోని చెత్తకుండిలో పడేశాడు. ఈ విషయాలను పోలీసుల విచారణలో డేవిడ్ అంగీకరించాడు.


నిజానికి.. ఇటలీలోని రెస్కాల్డినాలో ఉండే షార్లెట్ ఓ ఫెర్ఫ్యూమ్ షాప్‌లో సేల్స్ అసిస్టెంట్‌గా పని చేసేది. కానీ కోవిడ్ 19 కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆమె కెరీర్ మార్చుకుంది. అప్పటి నుంచి అశ్లీల చిత్రాల్లో నటించి వాటిని ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేసేది. అలా తన పాపులారిటీ పెంచుకుంది.


కాగా.. షార్లెట్ మార్చి 11-13 మధ్య లక్సీ క్లబ్ మిలానోలో జరిగే లక్సీ ఎరోటిక్ ఫెస్టివల్ 2లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఆమె ఆ షోకి హాజరు కాలేదు. దీంతో ఆమె అభిమానుల్లో ఒకరికి అనుమానం వచ్చి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి మీడియాకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి కాల్ రికార్డులు, అలాగే ఒంటిపై ఉండే టాటూ ఆధారంగా నటి శవాన్ని గుర్తించారు.


నిందితుడు నటిని హత్య చేసిన తర్వాత కూడా నటి ఫోన్‌ని ఉపయోగించి, ఆమె మెస్సేజ్‌లకు రిప్లైలు ఇస్తూ ఇంతకాలం తప్పించుకోగలిగాడు. అయితే కేసు విషయమై డేవిడ్ పొరుగింటి వారిని పోలీసులు ప్రశ్నించగా.. ఓ అందమైన యువతి ఎప్పుడూ అతని ఇంటికి వస్తూ పోతూ ఉండేదని చెప్పాడు. దీంతో అతని బండారం అంతా బయటికి వచ్చింది. అతను ఆ నటికి కెమెరామెన్‌గా పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-04-01T13:47:32+05:30 IST